పుట:Kavitvatatvavicharamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 22 కవిత్వతత్త్వ విచారము భారతాదులకు నీడైనదని నా యభిప్రాయము. పాండిత్యప్రభావము మిక్కిలియుఁ దక్కువ. హృదయముల నల్లలనాడించు భావనా శక్తియో యెక్కువ .

                ఈ తరగతికిం జేరినవి 'బాలనాగమ్మ కథ' 'బొబ్బిలిరాజు కథ' రాజాదేసింగు చరిత్రము' మొదలగు ప్రజాసమ్మతములైన కృతులు. వీని రామణీయకమునకు వేఅు తార్కాణములేల ! సమస్త స్త్రీ పురుషులయు మనసులలో స్థిరనివాసమేర్పఱుచుకొని యుంటయు చాలదా ? వీని నొకమా అువిన్న మఱల మఱువనగునా ? కావున నే పారంపర్యముగ జనులు. వీనిని బాడుచుండుటయు, తన్మూలమున నవి శిథిలములు గాకుండుటయు .
             కేవల కల్పితములైన వానింగూడ సాక్షాత్కారముందాల్చిన చేతనములం జేయంజూచునది కావున భావనాశక్తి నాటక కౌశ లంబుతో ననుసంధించియుండును. అనఁగా నాటక రచనాశక్తి యున్నంగాని కావ్యములు సైతము యథార్థములుగఁ గన్పింపవు. విరాటోద్యోగ పర్వంబులం జదివిచూచిన వారికి తిక్కన యెడ నీకళాకౌశలంబెంత పరిపూర్ణముగ నుండెననుట నావంటివాఁడు చెప్పవలసిన పనియేమి ? సంజయుఁడు, ధృతరాష్ట్రడు, ధర్మ రాజు, ద్రౌపది, కృష్ణుడు , దుర్యోధనుఁడు, కర్ణుఁడు మొదలగు వారు మన యెదుటనే మాటాడు మాడ్కి నుండుట పండితపామర విదితము. పాత్రల నడవడిని, వారిచేష్టలకును మాటలకు ను గల సమ్మేళన యెంత దృఢము! భారతములోని యేపద్యమైనం జదివిన యెడ, శైలింబట్టియే యది యెవరిదైనదియు C జెప్పవచ్చునని యొకానొకరి యభిప్రాయము.
         ఈ భావనాశక్తి యింత గొప్పగఁ గొందబ్ర లో వృద్ధిగాంచుట కేమి కారణము ? ఈ ప్రశ్న కుత్తరము సెప్పట బహు కష్టము. ఏలన తొలుతనే యిది స్వభావదత్తములైన సిద్ధులలో నొకటియని విన్న వించితి. ఆదిమములైన తత్త్వము లంగూర్చి వ్యాఖ్యానమునకుం బూనుట పిచ్చితలంపు. అట్లయినను ఒక లక్షణమాత్రము నిరూ పింపవచ్చునని తోఁచెడిని. ఎద్దియన ; *
                    భావనాశక్తి నుద్దీపింప జేయు ప్రకృతి భావతైక్ష్ణ్యము

మనుష్యుల మనంబులతో నిరంతర సంయోగముం దాల్చిన ప్రకృతులు మూఁడు గలవు. (1) ఆలోచనములు. (కార్యకారణ ములంగూర్చి విచారణ చేయుట, వస్తుస్వరూపము నిర్ణయించుట