పుట:Kavitvatatvavicharamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 21 నుండునట్లు శరీరమును ఛేదింపఁజాలినంత మిగుల వాఁడిగల కత్తి నొకదానిని పూర్వము విశ్వకర్మసన్నిభుఁడగు శిల్పి యొకండు నిర్మించెనని గాథయొకండు గలదు. ఆ కత్తితో నుత్ ప్రేక్ష్యములు నుపమేయములునైన యవి యాంధ్రదేశమున నిమ్మహనీయుని పద్యములే కాని వేఱెవ్వియు లేవు. "అరిది విలుకాని యుజ్వలశరము నకును" అట్టిగుఱి పదును పాతమును రావు. నిదర్శనములం జూపుటలో నితఁ డద్వితీయుడు. మఱియవి యోవ్వియు గూఢములు కావు. స్పష్టములు. శ్లేషచే స్థాపింపఁబడిన సామ్యము లట్లు దిక్కు నర్ధమును లేనివిగావు. వైశద్యము అనుగుణ మితనియందు ప్రబలము. మనము ప్రతిదినమందును జూచుచు నింతేకదాయని యాదరము నవధా సము నుంచక పోవు విషయములనే యీతఁడు గ్రహించి భావనాశక్తిచే గాంతి, రూపము, ప్రాణము నావహింపఁ జేసి యెదుట నిలుపఁగా, నపుడు గుర్తు దెలియక పూర్వము మనచే గర్షింపఁబడిన వయ్యును, నివియేవో యమానుష విగ్రహములని విస్మయముజెంది గారవింతుము. ఈ గారడీవిద్యలోఁ దెనుగున నితఁడ ప్రథముఁడు. సామాన్యవస్తువుల కేదే నొక కామరూపము నిచ్చి వెలయించుట యీతని మాహాత్మ్యములలో మొుదలింటిది. ప్రకృతిస్వరూపములను ఎంతచక్కఁగాఁ దన సృష్టి భావములతోఁ జూచి, యొకటి రెండు మాటలతోనే యచ్చటచ్చట వానిని సాక్షాత్కరింపఁజేసి యున్నాఁడనుట వేఱ నేనొత్తిచెప్పవలయునా ? ప్రకృతియనఁగా మనవారిలో ననేకులకు నిఘంటువులలోనుండం ప్రకృతియేగాని మూలింటికి బయటనున్న ప్రకృతి యెట్టిదో, తమ స్వంతకన్నులతోఁ జూచిన పాపమునఁబోరు ! అట్టివారికి వేమవ యనుసరణీయమగు త్రోవఁ జూపించినాఁడనుటలో నించుకయు గుణాధిక్యస్తతిలేదు. పల్నాటి వీర చరిత్రాదులు ఈకతో సర్వవిధముల సమానుడైనవాఁడో మించినవాఁడో యసంబేర్కొనఁ దగిన యాతఁడు పల్నాటి వీరచరిత్రమును వ్రాసిన వీరకవి " ఈ వీరచరితము కొన్ని ముబ్యాంశములలో రామాయణ

  • వీరభద్రారెడ్డి గూస్థానకవియైన శ్రీనాథుఁడు దీనిని వ్రాసిన వాఁడు కాఁడనుట నాకుంజూడ నిక్కువము. శ్రీనాథునిలో • పాండిత్యమునకు సమమైన కవితాశక్తిలేదు. పల్నాటి వీరచరితములోఁ గవితాశక్తికి సమానమైన పాండిత్యము లేదు. r. -