పుట:Kavitvatatvavicharamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 కవిత్వతత్త్వ విచారము

యని యా విద్యార్థి దీనుఁడయి వేడుఁడు, "అయ్యా! నీ చింతఁ తీర్ప నావలనఁగాదు. నీ యడిగిన వరంబు సాజమైన భావనాశక్తిచే లభ్యము. ఇట్టిట్లు చిత్రించుటచే ఘనుఁడ వగుదువని చెప్పి చేయించుటలో ఫలము లేదు. వాని వాని మనోబలము కొలదిఁ బరి పూర్ణత్వము సిద్ధించునేకాని యలంకారశాస్త్రముల ననుసరించుట నిష్ప్రయోజనము !" అని యా కళాకో విదుఁడు వా క్రుచ్చెను. జన్మముచేతన కవిగావలయుఁగాని పఠనము అభ్యాసము నివి యుండినమాత్రము చాలదు. తోడంబుట్టిన చాతుర్యముండినచో నివి సహాయభూతములై వృద్ధిని వికాసమును గల్పింపవచ్చును. స్వాధీనంబగు మనో గాంభీర్య మలవడియుండదేని కృషిఁజేయుట విత్తునాటక యెరువు వఱచినట్లు. కొన్ని పురుగులు మాత్రము సృష్టికి వచ్చునేమో ?

                                                            వేమన

ఈ తత్వమునకుఁ బ్రమాణమైనవాఁడు వేమన. ఇతనికి పుస్తకజ్ఞానము ఇంచుమించు సున్న వ్యాకరణము, ఛందస్సు, అలంకారశాస్త్రము మొదలగువానిలో నీతనికి శక్తి యెంతతక్కువో భక్తియు నంతతక్కువ. అట్లుడినను మహాకవులలోఁ జేరినవాఁ డని చెప్పటకై సామాన్యముగ శుష్క పండితులుదప్ప నింకెవరును సంధియాంపడరు. కుటిల మతాచారములు, మూఢభక్తి, వేషధారి తనము మొదలగువానిని దూలనాడుటయం దీతం డద్వితీయుఁడు. గొప్ప రహస్యముల బోధించినవాడైనను తనకుం గల నైజమగు బుద్ధినేకాని, పలుదెఱంగుల విపరీతవ్యాబ్యానములకుం బాలగు శాస్త్రముల నాశ్రయింపలేదు. అనేకులు సిద్ధాంతముల కాదార ములు ప్రాచీనసూత్రములని నమ్మి వానిని వల్లించుటకై జ్ఞాపక శక్తిని వృద్ధిచేయుచు మనశ్శక్తిని గోలు పోయెదరు. ఇంక వెమన యన్ననో కారణ విమర్శనశక్తికిఁ బట్టాభిషేకముం జేసిన మహా త్ముఁడు. ఇతని పద్యములన్నియు లోకోక్తులు. అనగాఁ బలికిన వాఁడు అతఁడయ్యుఁ బలుకcబడిన మాటలు లోకము వారి హృదయ ములలోఁ బూర్వమే యుండినట్టివియో, లేక అతనిచే నచలముగ నాటఁబడినట్టివియో యైనవనుట. ఇతని పద్యములలోఁ బరిహాస రసము దట్టము. మఱుగు మర్యాదలు లేని మోటు విధముగాc దిట్టఁడు. నొప్పిచెందువారు సైతము ఇతరులతోఁ గలసి నవ్వనట్లు సేయు సమర్థుఁడు. గాయము కానుపింపకయు, రక్తము కాఱకయు.