పుట:Kavitvatatvavicharamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 208 కవిత్వతత్త్వ విచారము

దేండ్ల క్రిందట మునిఁగిన యూరింగూర్చి కళాపూర్ణుఁడు విచారణ లకు మొదలిడుట యధికాలస్య ప్రసంగము. తరువాతగా నుండిన, నెల్లరాజులను జయించిన వాఁడుగదా, శ్రీకృష్ణ బలరాములను భీమార్జునులను మార్కొనెనా ? మజి, తనకుం గురువును దైవము నని కృష్ణుని సేవించివచ్చెనా ? అదియట్లుండె, అభినవ కౌముది యొక్క వయసు మొదలైనవి యురయుదుము. కల భాషిణి మణికంధరునిచేఁ జచ్చి పునర్జీవితయైద్వారకను మెలంగినది రెండేండ్లు. ఆవ అకే యభినవ కౌముది ప్రాయముది. శల్యా సురుఁడు వెన్నాడి కొన్నేండ్లు తిరిగియుండును గాన, 17 సంవత్స రము లన్నఁ దక్కువ లెక్క. ఈమెకుఁ దగిన నాధు ( డుగా నుండ వలయునని కళాపూరునకు గ సద్యోయ వనము విధింపఁ బడి యొు, కళాపూర్ణుఁడు పుట్టునప్పటికి నా పె వయసు 18 యనుకొను (డు. మధురలాలసా వివాహ మప్పటికి నా మెకు అధమ పక్షము 3 4 - 35 సంవత్సరములు నిండియుండును. ఎట్లు లేదన్నను ముప్పదికిఁ దక్కువయుండదు. ఇన్నాళ్ళు సంసారము చేసిన యూ పెకును, క్రొత్త పెండ్లికూ (తునకును రూప యావన వర్తన విభ్రమాదుల నేతారతమ్యమైన నుండునట్లు కవి వర్ణించినాఁడా విచారింపుఁడు ! నా కుంజూడలేదు. 15, 16 ఏండ్లు గొడ్రాలుగా నుండిన యా మె తటుక్కని మధురలాలసకన్నఁ గొంచెము ముందుగఁ బుత్రునిఁ గనెనఁట ! ఇప్పటివారిలో నిట్లు తటస్థించిన నెన్ని సందేహములు పట్టవు ! మధురలాలసకు బిడ్డ నీదలఁచి, పట్టపు దేవిని విడుచుట బాగుగాదనియు, నీ క్రియల నించుమించు వారు సరిపోలిన జతగా నేర్పడినట్లు ప్రదర్శింపవలయుననియు నెంచి చేయఁబడిన జ్యేష్టాంశ హేయకల్పన  !

                                       విషయమున ననౌచిత్యములు

సుగ్రహుని వయసు కృతయుగము లెక్కలోఁ జేర్పవలసి నదే. మన వారిలో మాటలు వేదమయములు. చేఁతలు బూతులు. చేవాంతములకును మానహీనములగు ననుషానములకును అన వరతానవసితమైత్రి. పరమయోగీశ్వరుఁడైన శివుఁడు "దేహార్ధమునఁ దాల్చ, దీఁగెబోఁడి !" అక్కథకుండగు వ్యాస శిష్యుఁడు సూతమహా మునీంద్రుఁడు, ఉపవాస వ్రతములచే డస్సి యెండిన శౌనకాది మహర్షుల హృదయముల రసము లూరునట్టుగా, స్త్రీలవర్ణనలు పోగు పోగుగా విడఁదీసినట్లు చెప్పచున్నాఁడనుట ప్రబంధములలో