పుట:Kavitvatatvavicharamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయ భాగము 203

కాళ్ళకు అష్టదిగ్రాణుల కిరీటముల యందలి మణులం దెచ్చి గజైలో నగలో చేసి పెట్టెదననియు ప్రతిజ్ఞఁజేయఁగా అమ్మలిరువురు శాంతించి చల్లఁబడిరి. సవతుల కొట్లాటకై రాజు లేట్లాడుట మనలో ప్రాచీనధర్మమే మో! ఐరోపావారిని నిందించునపు డీ న్యాయమును జ్ఞప్తియందుంచుకొన్న నన్యాయము పలుకకుందుము. అలంకార శాస్త్రములలో నేమి చెప్పినాఁడు ? " నయవిరచన యాత్రాజి దూత్య నిభు వర్ణనము" అనియా ? సరియే. ఈ భాగములో నే సంగతియైన వేసిన నొక్క పే. వేయకున్న నొక్క కేు, కాబట్టి వేయుదము, అని నిర్లేతుక జాయమాన శుక్ర నీతిని బ్రసంగించుచున్నాఁడు కవి ! సత్వదాత్ముండను యిన్నేండ్లు భూమి నేలిన ప్రభువునకు నుపదేశము చేయుట ముసలివాని కుపనయనము చేసినట్లు :

                          “ఇవి యననియు నిపుడు ప్రసం 
                           గవశంబునఁ జెప్పఁబడియెన్ గాని."
యనుచున్నాఁడు, ప్రసంగవశమా ! శుద్ధాబద్ధము. అలంకారశాస్త్ర వశమునఁగాదా ? ఇంక సంధి యొకటి బాకీ యుండ లేదా ? అది మగధ రాజుతోఁ జేయు దము. ఈ మగధ రాజు వృత్తాంతము నాకు

దిగ్భ్రమ, గల్గించుచున్నది. మధురలాల సా వివాహ సమయంబున,

                          “ఆశ్వలోచనముల కాత్మవస్త్రముకొంగు
                           మూటుగా నొనరించే మగధరాజు ”
              కాన నితఁడు సామంతుఁడుగదా ? ఇంతలో,
                  శా...............................................
                    నీరాష్ట్రంబున కెనర్చుటకుఁ బాగ్రాహుఁ డివ్వేళలన్
                    సారోదారుఁడు మాగధుం డిపుడు తత్సంధానమర్షంబగున్.
                                                                                       (కళా. ఆ. 7, ప. 270)

ఆనీ ప్రబలశత్రువైనట్లు మంత్రి చెప్పట యెట్టు ? మఱియు, స్వభావు డిచ్చిన విల్లునమ్ములునుండ మాగధుని మైత్రి యెందుకు, ఏటిలో వేయుట క్రా ? ఈ దిగ్విజయముగూడ సందర్భశుద్ధిలేనిది. ఏలన? మదా శయుcడు సకల రాజుల గెలుచునట్లు వరంబుగొన్నవాఁ డగుట నతఁ డటుచేసి సార్వభౌముఁడై యుండఁగా, నతనినిی కళా పూర్ణళడు గెల్చెనన్న నీ యధిక ప్రసంగము లన్నియు నివారిత ములై యుండును. అవును. "ఆజి" యని సూత్రమున్నదే ! ఇంత