పుట:Kavitvatatvavicharamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

204 కవిత్వతత్త్వ విచారమ

సర్వలక్షణ ప్రాప్తికి దానిని మెడగట్టుకోవలదా ? ధుత్యమ కొంత సూర్యాస్తమయ వర్ణనము . దీని యగత్యమేమో దేవునకే యెఱుక ! అందులోని కుయుక్తులో !

తే, నింగి యనియెడి ప్రత్తిచేనికిని రక
      బలియిడిరనంగ నెఱనంజ దొలుత నమరఁ
     దఱుచుగాదన విరిసిన దొరుగుఁ బ్రతి
      విళ్ళునా ఁజుక్కలెంతయు నుల్లసిల్లె!
                                                   (కళా. ఆ. 8, ప. 12)

ఆకాశము ప్రత్తిచేను ! రక్తబలి యిచ్చినారఁట ! చుక్కలు ప్రత్తి విళ్ళు! ఇట్లు వ్రాసిన మనవారి కేమో యానందము ! కష్ట తరముగనున్నఁ జాలును. మనోజ్ఞమని యెంతురు, ఆశ్చర్యము నకును నా మోదమునకును మనవారిలో వ్యత్యాసమేలేదు ! తరువాత జంద్రోదయము. ఇంకొక వికారాలంకారము !

“తే. కాలమను కువిందుఁడు చంద్రికాపటంబు
            నేయబనిన మగ్గనమొకో యనంగ
            వనమయూ ఖాళి గొనసాగి మివులనొప్పె
            విధుడమరె వాని గృహబిత్తి వివరమనగ
                                                  (కళా. ఆ. 8, ప. 15)

భావప్రధానముగ వక్కాణించు మయూరుఁడే సూర్యుని కిర ణము లాయన 'మీసాలు'గ నుపమించినాఁడు ! ఇఁక, తక్కువ కవుల మాటలేల ? అపురూపమే సురూపమని మనవారి భ్రాంతి. ఎంత క్లేశపడి సంపాదింతు మో యంతసుఖమని యెన్నిక ! పాతా ళమువఅకు ద్రవ్వి గులకజాయిం దెచ్చిన నది బుద్ధిబలమా, లేమియూ ?

పిమ్మట సూర్యోదయ వర్ణనము, మఱికొన్ని దుష్ట యోచనలు: సూర్యబింబము "గగనాఖ్య పనసవృక్ష ప్రకాండో పరిభ్రాజితంబగు పక్వఫల" మఁట ? ప్రబంధముల శ్రాద్దమునకై తేఁబడిన యెజ్జ గుమ్మడికాయ యనరాదా ! యోజనాశక్తికిం జేరిన చమత్కారము నకును భావముల నలరించు శక్తికిని ఎంత భేదము !

కళాపూర్ణుని ఙ్ఞు నేర్చిన ప్లే యున్నది. చతురంగము లలో నొక్కొక్క ద్ధమున కొక్కొక్క యంగము మాత్రము పూనినట్లు వ్రాసియున్నాడు. ఇది యా యంగసంగరముల వెవ్వే అుగ వర్ణించుటకై చేసికొన్న దబ్బర మర్యాదగాని, జయకాంక్షఁబోవు