పుట:Kavitvatatvavicharamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

202 కవిత్వతత్త్వ విచారము సంతసంబున బాలిశములగు చెయ్వులు దొడరఁ జూచిన జేయ కుడిగి యుడిగి మనమున నుబ్బమై మాట నాలుకకురాఁ గడ(గిన నాడక కడపి కడపి ధీరమై యిట్లు సమ్మద పూరమునకు గరువతనమును బలితంపఁ గట్టకట్టి వెలఁదియెరుఁగని యదివోలె వికృతిలేక యల్ల నెప్పటి యట్టుల యరుగుటయును. (ఆ. 3, ప. 56)

ఉత్తరంగూర్చిన పద్యములు నిట్టివ. ఆంధ్రమున శృంగార వర్ణనము తిక్కనయంత మనోహరముగఁ జేసినవా రెవరును లేరు. శుచి సౌందర్యములు నిత్యసంయోగములు.వీర కావ్యములో నించుక సందర్భ మలవఱిచి కొని యింతచేసిన ప్రతిభాశాలి శృంగార కావ్యమే వ్రాసియుండిన దాని రామణీయకము హృదయమున లయించునట్టి లావణ్యము గలదిగానుండదా ? ఒక వేళ నేకరస ప్రధానమగుట నతియను దోషంబునఁ దానుం బడియుండునా ? చెప్పలేము. ఇట నుదాహృతములగు పద్యములఁ జదివి నేత్రముల హర్దా శ్రువులు గ్రమ్మనట్లానందింపని వారాంధ్రమండలి నుండరు.
                     కళాపూర్ణోదయమునందలి మిగత కథ
  కళాపూర్ణోదయములోని మీఁది వృత్తాంతముల సంగ్రహముగ విమర్శింతము. ఈ భాగమునఁ గల్పన లేదు, కథ లేదు. ఒక విషయమునకు నొక విషయముగా నిష్ణారణమై నటించి పుస్తకముఁ బొడుగు (జేయుట కవి యుద్దేశ మేమో ! ఆ సర్వలక్షణ సంపన్నతా ప్రతిజ్ఞయొక్క దు ప్ర్పకృతి యిటC దేటతెల్లంబు. రాణులిద్దఱకును జెలికత్తెల మాటలచేఁ బ్రేరితమైన కొట్లాట ఘటిల్లినది. నీచపాత్ర ములేగదా మన రాజులకు రాణులకు మంత్రులు : రాజు అభినవ కౌముది కాళ్ళు పట్టుకొనుచున్నాఁడు.  కృష్ణమూర్తి యీ మర్యాదకు సృష్టికర్త ! ఎన్నడొ సత్యభామ కాళ్లు పనో లేదో, రాజు లందఱు నాయన యుపదేశములనెల్ల నిదియే సులభసాధ్యమని యో Oచి యవలంబించి సనాతనాచారములోఁ జేర్చిరి.

పిమ్మట రాజుగారు సవతులు యలుక దీర్చుటకై పెద్దామెను గానవిద్యావిశారదం జేయుదుననియు, చిన్నయా మెకు (ఆ పె కాళ్ళ మీఁద బడినాఁడు. లేకున్న నీ మెమాత్ర మూరకుండునేమి ?) నీ