పుట:Kavitvatatvavicharamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 తృతీయ భాగము 185

                   క. ... ... ... ... ... అంగజతాపం
                      బున నుస్సురుస్సురనుచుం
                      గనురెప్పలు దేలవైచి కడుసొలయుటయున్.
                                                                       {కళా. ఆ. 6, ప. 249)
                  ఇఁక శైత్యోపచార ప్రారంభము !
       స         విరిదమ్మి తావులు వెదఁజల్లు కొలనిచెం
                                          గటఁగమ్మ పన్నీటి కాలువలును
                   గడు నివతాళించు కప్రపటనఁటుల
                                           యిరవులఁ బూవుఁ జప్పరముఁ బన్ని
                  వట్టి వేళ్ళను దడిగట్టి శ్రీగంధపు
                                          టసలునమెత్తి తదంతరమునఁ 
                  కర్పూర వేదికం గావించి చల్లని
                                         చెంగల్వరేకుల సెజ్జఁదీర్చి 
                  చిలుకుదేనియతోడి గొజ్జంగిపూవుఁ
                  దలగడయమర్చి యందు నా జెలువనునిచి !
                 జగతిఁగల నర్వశైత్యపచారవిధులు
                నలిపిరందును గడఁగాన కలసిరంత.
                                                         (కళా. ఆ, 6, ప. 251)
           ఈ పద్యములోని విశేషములఁ దలచుకొన్న నాకు గుండియు లదరుచున్నవి ! అబలలు, పూఁబోండ్లు, కోమలాంగులు అనఁబడు సఖీజనములు, గున్నయేనుగులవంటి యిరువదిమంది కూలివాండ్రు చేయుట కన్న నెక్కువ పనిని ఇంత త్వరలో నేలాగునఁజేసి ముగించిరి ! కార్య మెంత సేపుపత్రైను ? ఆదివ ఆ9కు నంగనామgది సొలసియే యుండెనా ? లేదా, శాస్త్రప్రకారము మంచిలగ్నము చూచి యీ వేళకు నామె మూర్ఛపోవునని యెఱింగి యాక్రియ లన్నియు ముందునాఁడే తయారుచేసి యెదురు చూచుచుండి రా ? నా కుంజూడ నిట్టి పద్యములు కవులు తొలుతనే వ్రాసి పెట్టి పిమ్మట నది యే కథ యైన నేమి, యక్కడక్కడఁ దూర్చి పెట్టుదురేమో !
               ఉ   . . . . . . . . . . . . . . . . . . . . . . . . .۴غه

. . ... ... ...పూవిననకఱ్ఱలు గొజ్జగినీట మాటికిం

                      దొప్పగఁదోఁచి వీచుచుఁ జనుంగవపై, నరకాళ్ళ, బాణులన్   
                     లప్పలు గాఁగఁ జందనమలందుచుఁ గొందలమందిరందఱున్. 252