పుట:Kavitvatatvavicharamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

184 కవిత్వతత్త్వ విచారము

నాచారము రీతిఁ బ్రకటింపఁ జొచ్చినఁ జెలికత్తెలు వెఱఁగంది మామూలు విచారణ లకు ప్రారంభించిరి. ఈ చెలికత్తెవిషయమై నాకొక సందేహము ! యజమాను రాలి యుడుకుఁ బొడఁగను వేళలఁ ద మకుఁ గొంత కా (క యొక్క దాయేమి ? ඩ්රි కష్టము నరయు కవులు లేరుగా ! వారు ప్రతిక్రియఁ జేయుటకై " శుద్ధముగ నుప యోగములేని చికిత్సయని ప్రబంధము ఆవలన దెలిసియుండి యు నా మె నుద్యానవనమునకుం దోడ్కొని పోయిరి . ఇది మొదలు కవి గతానుగతికముగా వ్రాయుచున్నాఁడే గాని, స్వబుద్ధి పొంతఁబోవునట్లు గానము. భావములు నవ్యములు గావు. రుచిరములుఁగావు. పాట ప్రాఁత. మాట రోఁత ! మధురలాలసయుఁ దత్సఖులును జల క్రీడలాడిరి. దేహమునకు శాంతమే మోగాని యూడిన తరువాత "నవీనవస్త్రాభరణ గంధమాల్యంబు ల నలంకృత లైరి". సరియే కాని ఈ భారమగు వస్తుసామగ్రి నెవరు మోచి కొని తెచ్చి సిద్ధముగ నిడిపోయిరో పత్తాలేదు ! అప్పడు రాజుగారు తటుక్కున వచ్చిరి. ఇCక రాకున్న వారికీ కన్నె జ్ఞప్తికి వచ్చు టెట్లు 2 తిక్క బలియు టెట్లు ? సరి. పరస్పర దర్శనము సంప్రాప్తము

చ. వినుకలిచేతమున్ మిగుల వింతలు గాగ విరాళిఁగొన్న య
వ్వనజదళాక్షి యట్లు దనవల్లభురూపముఁ గన్నులారఁగాఁ
గనుఁగొని . . . . . . . . . . . . . . . . .*
                                     (కళా. ఆ. 6, ప. 239)

అని యున్నది. దీనికి బూర్వ మెన్నఁడును జూడకున్న గళా పూర్ణుఁడని గుర్తెట్లు గలిగె ? మఱియు

ఏమ గన్నులఁగన్న హృదయేశు రూపంబు
దోఁపక యదిమున్నె దోఁపకుండె”

నని పూర్వమే యాపె యుపద్రవముంగూర్చి వ్రాసియుండు టం జూడ కన్నులC జూడకమున్నే హృదయమున రూపమావిర్భ వింపఁగల వింతమానిసియో యీ మదాశయు పుత్రి ! లేక చిత్ర ఫల మే మైన నీ వినోదముల కాధారముగా నుండునా ! ఊహ్యము. కళాపూర్జుఁడు "ఎట్టకేలకుఁజనియె దిరిగి". ఈ ముద్దరాలును తియ్యని పచ్చి పచ్చి యోజనులకుం దొడంగుచున్నది ! "ఇంకెట్టు లమ్మా ! తోఁ టు కేల పిలుచుకొని వచ్చితి మే ? ఆ రామములు మన్మధపక్షములు గదా !" యని చెలులెల్ల నొక చిన్న లెక్చరు వేయునప్పటికి నంగనామgచియు,