పుట:Kavitvatatvavicharamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

186 కవిత్వతత్త్వ విచారము

                                                                 ఏమి సౌకుమార్యము ! ఇతరులు దేహమునట్లు తో ముచు

గుజ్ఞమును మాలీసుచేసినట్లు చేయుచుండఁగా సంతోషముచే సకి లించు గుణము గలుగవలయునన్న పాలియగాండ్ర యిండ్లలో నవతారమెత్తవలెను ! లేకున్న నట్టిగడుసుదనము అరిది. ఆ సంగతి యటుండనిండు. ఈ యుపచారములు నపచారములు జరుగుచుం డఁగానంద అు గప్ చుప్ అని యూరకుండిరి. మాటలేదు. అవి ముగిసినదే మౌనముద్రం బగులఁగొట్టి చిలుకల వలెఁ గిలారింప ξύο ζήδ. "అయ్యో ! అమ్మా ! చెప్పవే నీకష్టము ప్రాణ సఖితో " నని యొుక నంగనాచి ప్రార్ధింపఁగా (ఇదివరకును ఏమియుఁ దెలియకయా యిన్ని దోహదములు చేసియుండుట ? ) మధుర లాల స యెట్లో మనసును నాలుకను దృఢ పఱుచుకొని యేమను చున్నది.

       ఉ. ఓ హరిణాక్షి నీకు నిఁక నుల్లముదాఁపఁగ నేటికిన్ జగ
           న్మోహనమూర్తితోడ నటమున్నొక నాఁటినిశన్ విలాస స 
            న్నాహముమీఱ మద్విభుఁడు יס కలలోపలవచ్చి తేర్చెఁగా 
            మూహవక్షేళి నద్భుత సుఖైకమయంబది యేమిచెప్పదున్ !         261 
     కుల స్త్రీలు ? ఒక్క యుషాదేవి చూపిన దారిండ్రొక్కు గొట్టెలు ! ఇట్టి యేడ్పు నెవరైన నొక రేడ్చిన సంగీతముగా నుండును. అందఱుఁ గూసినఁ బెద్దరోఁత !
            “ముదితా చలువలు గిలువలు
            మదికి నసహ్యంబు లతని మన్ననఁ దక్కన్.”

అనుచున్నది. అట్లయిన మొదలే యేల వలదనరాదు ! చెలికత్తెలు గసియెత్తునట్లు శ్రమపడుచుండఁగా హాయిగాఁ బండుకొని వేఁడుక చూచుట న్యాయమా ?

   ಇಲ್ಲು వీరు రహస్యములు మార్చుకొనుచుండఁగా వెన్నెల యయ్యెను? నాకు నిక్కడ నొక ధర్మసంకటము. ఈ కాంతా తిలక ముల జాతి యేమి ? ఏమి విపరీతప్పఁ బ్రశ్నయందురో ! నా శంకకు గారణములఁ బరీక్షింపుఁడు. జలక్రీడకు నెంతయూలస్యమైనను మధ్యాహ్నము 1 గంటకు వచ్చియుందురు, ఆ వెనుక చలి దుర్భరము గావున, పుష్పాపచయాది లీలలు, అంగనామణి యొక్క వికారములు, సఖీజన రాజకుమారికా ప్రశ్నోత్తర మాలికలు, ఇవి నడచుసరికి చంద్రోదయము. పన్నమనాఁడనుకొన్నను ఆరు ఆరున్నర గంటలకుఁ గదా చందుఁడు పొడచూపియుండును.