పుట:Kavitvatatvavicharamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

130 కవిత్వతత్త్వ విచారము

సల్లాపములలోనా ? కవి యాయమ నొంటిగా విడిచి మఱచి యుండుట మహాపాపము. పొరపాటు ! యాత్ర వలనఁ గలిగిన ఫల మిదియే !

ఈ ఘట్టమునకన్న సందర్భశుద్ధిలేనిది పంచమాశ్వాసములో 1 32 వ పద్యము మొదలు 174 వ పద్యము వరకునుగల పసి పాపచేఁ జేయఁబడిన యోగవిద్యా విషయక మైన దీర్ఘ ప్రసంగము. ఈ విమోచన మార్గ ప్రదర్శనము శుద్ధముగ ననవసరము. అసంగ తము. అసమ్మతమును !
              దోషవిచారణ యటుండనిచ్చి యీ కావ్యము ను త్కృపతమం బని పరఁగంజేసిన గుణంబుల నభినందింతము.

సద్గుణములు

నాటకరీతిని సంభాషణాదులచే వృత్తములం బ్రకటించుట యందు నీ గ్రంథము అసదృశము. సామాన్యక వులు రాజు నొక్కని బేర్కొని యతని దేహమనో లక్షణముల ముప్పదినలువది పద్దెము లచే పొడవుగను అసంగతమును గ్రంథాది నే వల్లింతురు ! అనఁగా తత్పూర్వకవులరీతినే మాఱుమాటలఁ జేయు స్తవమనుట. వంది మాగధస్తుతులచే నెవ్వని గొప్పతనమును సాక్షాత్కారముం జెంది ನಿಲ್ಲು తోఁపదు. గుణములు చర్యలచేఁ బ్రకటితములగు, ఏ నడవడియులేని వాని మనఃప్రకృతి నెఱుంగఁ బోలునా ? కావున కథలో నాయకుండొనర్చు కృత్యములచే నతని శీలము తెఱంగు మనకు బోధయగు నట్లోనర్పనగునుగాని, ప్రత్యేకముగ ధర్మముల జాబితానొకటి వ్రాసి యతని మెడఁ గట్టినఁ గవియొక్క బుద్ధిలేమి దక్క నింకెద్దియుఁ దెల్లంబుగాదు. అనేక కార్యములతో నిండి నట్లు కథం గల్పింప లేనివారికి జాపితా పద్ధతియే గతి, దుర్గతి. ఈ సార్వభౌముండు చైతన్యమును వహించిన సంగ్రహధర్మశాస్త్రము అనుటలో సత్యము సుఖమును రెండును సున్పలు. మఱియు, ప్రదర్శింపఁబడు కార్యజాలములతో సంబంధములేని గుణముల వర్ణించుట పనికిమాలిన పెత్తనము. సంబంధముగల గుణముల మాత్రము వర్ణించుట కర్తవ్యమేని, కార్యసంబంధములచే నవి యొకరు చెప్పక చూపకయు తమంతఁ దేటపడవా ? యుద్ధమున నవక్ర విక్రమము చూపెడు నభిమన్యుఁ గూర్చి వేఱుగ నితఁడు ధైర్యశాలియని శ్లాఘింపకున్న మన మెఱుఁగ లేమా ? అట్టి శ్లాఘనలు గూడదని కాదు నా మతము. మణి పాత్రముల మూలమునఁ జేయ