పుట:Kavitvatatvavicharamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 129

దౌర్భాగ్యపుఁ బ్రతిజ్ఞయును. మహాకావ్యమని శాస్త్రకారులచేఁ బేర్డ్లోనఁ బడినదాని నుత్పాదింపఁబోయి కవిత్వమున కుత్పాత మాపాదిచె ననుట స్పష్టము .

పథమ భాగములోని పౌర బాటులు

ప్రథమ భాగమున కాలదోషము లంతగా లేవు. అనంగా ప్రబంధముల తీరు తక్షువ యనుట. మఱి సర్వలక్షణ సంపన్నతచేఁ గలిగిన దోషములు పెక్కులున్నవి. మణికంధరుఁడు తపస్సు చేయుటకు ను పోద్దాత మో యనునట్లు నిస్సంగత్వ దోష భాజనమైన యాత్రాభివర్ణన మొకటి చేయంబడి యున్నది. ఈ యాత్రలచేఁ గథకు గలుగు ఫలములు రెండు. వైపుల్యము, వైరస్యము. ఆ ! ఒక యూహమై దీనిని సార్థకమందమా ! ఈ బుషి తపో భంగము నకై రంభ రాఁబోవుచున్నది కదా ! ఆ పెకు నసహ్యము గలుగకుండు ನಿಲ್ಲು కొన్ని స్నానములు చేయించి శుభ్ర కాయునిఁగాఁ జేసి యుంత మని కవి తర్కించి యుండునా ? తర్కించియుండెఁబో. కోరిక యూ డే రు మార్గమిది గాదుగదా. ఎట్లన, వీరెన్ని మునుకలు వేసిన నేమి ? తపస్సులోఁ గూర్చుండి యేకాగ్రముగ మై మఱచి కొన్ని వత్సరములు — వత్సరము లెల ? – వాసరములున్నంజాలదా ! — మలయ మారు తమువలె ప్రజ్వరిల్లుటకు : అనాదరణ పాత్రమగు నీ |పసంగములకు నాహుతి గా నీcబడినవి సుమారు నలువదియైదు పద్యములు !

కలభాణకిని నలకూబరునిపైఁగల మోహము కృతార్థమగు టకు నీ తీర్థయాత్ర యొక్క యిక్కట్టు చూడు డు. నలుకూబరునిఁ జూచి వలచిన పిదప నారదుని శిష్యురాలై గానవిద్యాభ్యాసమునఁ గడపిన యేండ్లు నాలుగు. ఇట్లంత కాలయాపన ముప్పడే యుయి యుండఁగాఁ ద్వరలోదపోవర్ణనముం బ్రదర్శించి హృదయసాఫల్య మంద అకుఁ జేసియుంచిన బాగు. ఆ మధ్యమున యాత్రకై యొకటి రెండేండ్లు వినియోగించుట శృంగారభంగము. కల భాషిప్ కి వయసు ముదరక యుండునా ? మఱియు , నా నాలుగేండ్లు నీప్సితిసిద్ధి కొఱ కైన సన్నాహమునఁ గడపఁబడెఁగాన నా పె యోర్చియుండుట సహ జము . ఈ యాత్రలో దగులఁబెట్టిన కాలము నా మె యే రీతిఁ గడి పెను ? నలకూ బర స్మరణలోనా ? విరహవిషయమైన సఖులతోడి

  • నేను ప్రథమభాగ మనునది 6 వ యాశ్వాసములోని 189-వ పద్యమువజకు నుండు భాగమనియు, ద్వితీయ భాగము దక్కినది యనియుం దెలియునది.