పుట:Kavitvatatvavicharamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128 కవిత్వతత్త్వ విచారము

శంకఁ గలుగఁ జేసి కథయందు నమ్మికను భ్రమను బోఁగొట్లుఁ గావున, ఇఁక ముందఱి వృత్తాంతమింకను ప్రాయోభావమునకు దూరము .

                       “వ. నాఁడట్లు బోధోదయం బగుటయునుడుగుటయు నేతన్మూలంబులని
                            యెవ్వరు నెఱుంగకుండుటను నిది సామాన్య హారంబ యను తలంపున
                            మా వారు దాఁచి మఱచుటఁ జేసి నాఁటనుండి నేఁటిదాఁక నిద్దివ్యహారం
                            బెన్నఁడును ధరియించుటయు లేదు. నేఁ డాభరణ భరణసమయం
                            బునఁ బ్రసంగవశంబునఁ దలంచికొని చెలులు తత్ ప్రాప్తి ప్రకారం
                            బెఱింగింప నిది సుముహూర్త లబ్ధంబైన ప్రథమ భూషణంబనియు
                           భవద్దత్తంబనియు నత్యాదరంబునఁ దెప్పించి హృదయభాగ స్పర్శ
                           నాయకరత్నంబు గా నిపుడు ధరియించి యున్నదాన."
                                                                                 (కళా. ఆ, 8, ప. 189)

ఇందలి యసంభావ్యములు రెండు. కన్యగా నుండునపుడు ఆ రాజుగాలియైన సోఁకునా దేవుcడా యని వ్యథగూర్చుచున్న విరహవేదన కాలమున, పెండ్లినాఁడు, ఎన్నఁడును రాని ప్రసంగ వశము ఇప్పడేల పైఁబడవలయును ? రెండవది హృదయభాగ స్పర్శ నాయకరత్నంబుగా' ధరింపబుద్ధి నిష్కారణముగా నేల పొడమవలయు ? లోకములో నదృష్టములు, నిర్ణేతుకములు నైన యాకస్మికములు లేక పో లేదు గాని, పదేపదే వలసిన చోట్లనెల్లఁ గాకతాళీయ న్యాయముల నాశ్రయించుట కల్పనకు మిక్కిలిఁ గొఱఁత. కామరూపములు, దివ్యదృష్టి , ఇత్యాదులు అన్నికష్టము లకు ననుకూలించు సాధనములు గాన బ్రశస్తములు గావు. సర్వ సందర్భములలోఁ జేరజాలినవి యినా కథలో దప్పక చేర్పఁదగిన యంశములని చెప్పవీలులేదు గనుక, నిట్టి వేసందర్భములను జేర్ప కుంట మేలు. కథ కెల్ల సూత్రమువలె నుండు నీ హార మిన్ని వక్ర ముల కాస్పదమగుట చింతా వహము !
                షష్టాశ్వాస మధ్యభాగమునకుఁ దరువాతి భాగములు తుచ్ఛ ప్రబంధ రీతిని వ్రాయcబడిన భావవిహీన ఘట్టములు గావున వానిని ప్రత్యేకముగ విమర్శించుటొప్ప. తత్పూర్వభాగములలోఁ బ్రతిభ, భావము, కృతినిర్మాణ చాతుర్యము, నివన్నియు బుష్కలముగ ప్రకాశించునట్లు రచించిన యీ మహాకవి ని రసవర్ణములకుం టకుఁ గారణములు, కాలదోషములును, అలంకార శాస్త్రముల యెడ వినయవినమ్రుఁడై 'సకల లక్షణ సంపన్నము' గా వ్రాయ బూనిన