పుట:Kavitvatatvavicharamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

126 కవిత్వతత్త్వ విచారము కాలక్రమమును బాటింపక నాటక రీతిగాఁ బాత్రములచే కథను బెంపొందించుటలో సూరన్న యద్వితీయుఁడు. ఈ కౌశల మీతని క్రిఁ బరిపక్వము గామి చేతనో, య లంకార శాస్త్రములకు విధేయుఁ డైనందుననో, ద్వారకాపుర వర్ణనము ప్రభావతీ ప్రద్యుమ్నమున నున్నంత సొంపుగా నిటలేదు. కవియే నేరుగ వర్ణించునట్లు వ్రాయుట యొక దోషము మఱియు C బురజనవర్ణనము C గూడ, జేసియున్నాఁడు. ఇది గర్ఘ్యము. ఏలన, కావ్యమున నే యే పాత్ర ములు వచ్చునో వానిని మాత్ర ముచితస్థలముల వర్ణింపవలయునే కాని, కథారంభమున నిష్ ప్రయోజన వర్ణనములం జేయుట య సంగతి యను వికారము.

కల్పనాదోషములు

షష్ణా శ్వాసములోని 189 వ పద్యము వఱకు నుండు నంత ప్రొఢముగఁ దరువాతి భాగములు లేవు. ఈ గ్రంథమంతటితో సమాప్తి జేసియున్న సమ్మాన్యతరమై యుండును. ఏడవ , ఎనిమిదవ యా శ్వాసములలో భావనాశక్తి, ప్రతిభ మొదలగు కవిత్వ శక్తులు బలహీనములు. తుదకు మధుర లాలసా పరిణయూదులు వర్ణింపఁ బడకున్నను తత్పూర్వకథచే నూహ్యముల కావున వానిని బొందించియుంట వునరుక్తిఁ బోనిది. ప్రధానా బ్యానముతో నైక్యము వీని కత్యల్పము. అట్లుండియు నీ నిరర్ధక ప్రస్తావనకు గవి యేల ప్రవర్తించినాఁ డనుట చింతనీయము.

కథాంగము లేక భావ ముం దాల్చి యొక నేర్పడి యున్నఁ గళకు ప్రాశస్త్యము. అట్టి గాఢ సంయోగమునకు షష్ణా శ్వాసములోని పూర్వోదిత పద్యమునకుఁ దరువాతి భాగములన్నియు విచ్ఛేద హేతువులు. ఇది యెఱింగి ప్రతి క్రియ చేయ నెంచినవాఁడై కాఁబోలు, కథ యొక్క యాదినుండి యంత్యమువ అకు 'పూసలలో దారమట్లు' యిమిడియుండు గతి మణిహార వృత్తాంతముంగూర్చి యున్నాఁడు. ఈ హార వృత్తాంతముం దిలకింపుఁడు.

మణి హశీర వృత్తాంతము

దీనికి నాదిమ ప్రభువు విష్ణువు. అతనిని దపస్సుచే మెప్పించి దానిని బడసిన వాఁడు సుగ్రహుఁడు. పిమ్మట బ్రాహ్మణ శాపమున నతండు దనదొల్లటి యెఱుకయంతయు హ తంబుగాcగా, నూతనావ తార మెత్తినవాని ಯಿಲ್ಲು సత్వదాత్ముఁడను పేరcబరఁగి రాజు గాc