పుట:Kavitvatatvavicharamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 127

గొంతకాల ముండి పిమ్మటC గళాపూర్ణునికి మంత్రిగాఁ గుది రె. సుగ్రహుఁడు మున్ను దేవతా లయములోఁ బెట్టి మఱచిన యూ మణి హారమును మధురాపుర పు బ్రాహ్మణుఁ డొకఁడు తీసికొనిపోయి తన యింట బహు వర్షములు పూజ సేయుచు నుంచి కొని ద్వారక కరిగి శ్రీకృపనికి సమర్పించెను. శ్రీకృష్ణCడును "దండకాకృతి సమజ్జ్వల సంస్తవ లీల కెంతయున్ ఘనముగ మెచ్చి యిచ్చె మణికంధర నామునకున్" మణి కంధరుఁ డలఘు వ్రతునకు, నతఁడు కళాపూర్డు నకును, నాతఁడు శిశుప్రాయ యగు మధురలాలసకుని గ్రమముగ నొసంగిరి. అట్లగుట నీ హారమును సరస్వతీ చతుర్ముఖ విలాస క్రీడయుం బోలెఁ గథ నేకీభూతముం జేయు కల్పనలలో నొక్కటి. పూర్వోత్తరభాగంబు లన్నిటికిని ఈ హారము సామాన్యము. కథ నెల్లఁ బ్రాఁకి యుండు తీ ఁగవంటిది.

         ఈ రీతి కల్పన మహెూత్తరమైనదయ్యు నిష్కళంకంబు గాదు. ఎట్లన, ఆ హారముయొక్క నాయక మణి యెవ్వరి హృదయ స్థలంబున నెంతవరకు సో కరియుండునో, యంతతడవును వారికి సర్వజ్ఞత్వము, వాక్యపటుత్వమును సిద్ధించునని విప్పవు వరము. దాని సత్యము ననుభవమునకుఁ దెచ్చికొనులోపల సుగ్రహుండు శాపహతుఁడాయె ! మధురాపురి బ్రాహ్మణుఁడన్ననో దానిని గంఠ ములో ధరింపక పూజ సేయుచు బహు వర్షము లున్నాఁడఁట ! వాని భార్యయొక్క చిత్త స్థిర్యమెంత దృఢమో! ఆ పెగూడ దొంగతనము గా నైన దానిని వేసికొనలేదు. శ్రీకృష్ణుఁడు మణికంధరుని మెడలో వేసి నాఁడు గాని యది "బాలతఁ గనుపట్టు విష్ణుని కలాపము గావునఁ దద్భుజాంతర స్థితికి చాల కొప్పి గళ సీమన యొంతయు గుప్తమై " యుండెనఁట! 'బాలతఁగనుపట్టు' అను విశేషణము సమంజసమా? పూజారి బ్రాహ్మణుఁ డిచ్చినది బాలకృష్ణునకా? షోడశసహస్ర మహిషీ యు తునకా ! పిమ్మట శిశువుగానున్న మధురలా లసకుఁ గళా పూర్జుఁడు వేయఁగా నాయకరత్న యాపె హృదయంబు సోఁకునట్టు పడినది ! సమయముఁ జూచి పడవలసినచోటఁ బడినవిగదా! ఎంత తెలివిగల పతకము! అట్లు సర్వజ్ఞమైన యబ్బాలికామణి యనేకులు పూర్వ వృత్తాంతముందెల్పి సత్వదాత్ముని చరిత్రమునకు వచ్చు నప్పటి కాపె "యటునటుఁ గదలఁగఁ దన్మణి హృదయస్థలముఁ బాసి కడకేఁగుటఁ దెలివి యుడిగెను!" ఇట్లు వ్రాయుట కామరూప ధారణమునకన) నభావ్యము. ఏలన, సత్యముగా నుండునా యను