పుట:Kavitvatatvavicharamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ద్వితీయ భాగము 125


ముగ జేర్చినాడే యను విస్మయ మొక్కటి! మఱి, యీ ఫలములు దేవతల కశుభములగు గావున వినవలయునను సంభ్రమ మింకను నుద్దాఢమగును. ఒక పక్షము వారికి మేలుగను, మఱియొక పక్షము వారికిఁ గీడుగను అవతరించిన యీ చరిత్ర మేరీతి భూలోకములో వ్యాపింపఁ గలదని యాశ్చర్యపడమా ! కథ దేవలోకములోఁ బుట్టి యుండుట ఈ వ ఱకే స్పష్టము . ఇఁక దేవతలు దెల్పనిది మనకుఁ దెలియ టేభంగిని ? కథయే మో తెలిసియేయున్నది. లేకున్న నీ కావ్య మెక్కడిది ? నారదుడును

“తే. అతివ ! విను రంభకును గల యుట్టి భయము
                                       నాకుఁ గల్గుటఁ దత్కథ నీకుఁ జెప్ప
                                       గూడ దట్లయ్యు మిక్కిలి కువలయమున
                                      వెలయఁ గలదది వెలయు త్రోవలును గలుగు !"
                                                                            (కళా. ఆ. 1, ప. 204)

అని చెప్పచున్నాఁడు. అతని వాక్య మ మోఘము ! అట్లగుట నెవ్వ రికిని నపాయంబు నా పాదింపని యే మంత్రముచే గవి యీ క్రియ సమర్థించునో యని యబ్బురపాటును, దొ ట్రుపాటును జదువరు లకుఁ దల మున్క లౌఁగదా ! మనల నేకా గ్రావధానులం బరవశ చిత్తులం జేయుటకంటె శిల్ప సౌభాగ్యమెయ్యది ? కల్పన యనఁగా నిట్లుండునదే కల్పన. ఊపిరి యాడకుండునంత యు ద్వేగముం గలిచునది.

ఆధార విషయమును గార్యముచే రోయcబడిన కారణముగాc జూపుటయే గాదు. మీఁది యుదాహరణములం జూచిన నంగ ప్రాయములను చిల్లర విషయములంగూడఁ గాలసరణిగ నీ కవి వర్ణన సేయఁడని తెలియుచున్నది. రంభానల కూబరు లాడుకొను చున్న కళాపూర్ణ గాథలు అటు తరువాత నడిచిన కల భాషి ఇటీ నారద ప్రసంగమునం దేలుచున్నవి. దీనింగూర్చిన నిదర్శనము లీ గ్రంథ ములో లెక్కకు మీఱి యున్నవి. నారదుఁడు గాన విద్యాభ్యాసము నకై ద్వారకకు రాకపోకలఁ జేయుట ప్రథమ ద్వితీయాశ్వాసము లలో నివేదితము. దీనికిం గారణము కల భాషిణి మణి స్తంభుల సంభాషణములో నారదునికిఁ దుంబురునితో నైన మాత్సర్యము నకు హేతువు, ఆ నారదుఁడే మణికంధరునితో ఁ జెప్పినట్లు సిద్దుఁడు వివరించిన, తుంబురునికి గానవిద్యా ప్రభావంబున వైకుంఠ లోకములో c బూర్వ మెప్పడో నడచిన యునితర భావ్య సత్కారము.