పుట:Kavitvatatvavicharamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120 కవిత్వతత్త్వ విచారము

మగవాఁడా ! కావునఁ దప్పక వెలి వేసి యుండును" అని యెంతురు గాఁబోలు ! ఇట్లు పల్లెఱంగుల నమ్మహాదేవి నొక నిమిషమైన నెడఁ బాయఁజాలక మనస్వాంతము లాయమంజుట్టి రక్షక సైన్యము లట్లు గాచుచు నా మె కారోపింపఁబడిన యవస్థల దాల్చును . దీని కేవి ప్రమాణము లందు రో, మీ యనుభవమును, పురి బానుపుంఖముగ బయలు వెడలిన ఉత్తర రామాయణము, మైరావణ చరిత్ర మున్నగు ను పరామాయణములును, వాల్మీకి యొక్క మాహాత్మ్య మేమనవచ్చును! అతని భావనాశక్తి తాఁకినఁ జాలును, మనకుండు బడుగో బక్క యోడ్రైన ప్రతిభయును సాంగత్య పేరణచే యావచ్ఛక్తిని బట్టవట్టి బయటఁ బెట్టి విజృంభణముతో నెందఱు పట్టినను నాపరానిదై " భావాంబరవీధి" విహరించును ! కవి బ్రహ్మల చందమిట్టిది. తామిడిన యారగింపుతో రక్తి పూర్తియై యంత మొందదు. మఱి యూరగింప నారగింప నింకను గావలయునను స్పృహ ప్రజ్వరీల్లును ఆత్మకేళియందు విరతి కాస్పదమైన రతి యెక్కడిది. రామాయణంబున సీతాపహరణ మెట్టులో భారతమున ద్రౌపదీ వస్తాపహరణము నట్టిద. పాంచాలీపరిభవము రక్తముతోఁ గాని తదితరములతోఁ గడిగివేయఁ గాదని మనసునకుఁ దట్లని మనుజులున్నారా ? ఆ కార్యము నెఱవేఱువఱకు నందే చిత్తములు హత్తి యూపిరాడనట్టు లుండును. అయిన నొక విజ్ఞప్తి. ఇప్పడు వ్యాప్తిలోనుండు భారతము దాని కాదికవియైన వ్యాసుఁడు వ్రాసినది గా దు. వ్యాస ప్రోక్తము గొంత భాగము మాత్రము. గ్రంథము సుప్రసిద్ధమగుడు జైనులు, వైష్ణవులు, బౌద్ధులు, స్మార్తులు, వీరశైవులు, పౌరాణికులు మొదలగు తెగల వారందఱుఁ దమతము సిద్ధాంతముల నందులోఁ జొనిపి యూ యితిహాసమును బాడు సేసిరి గాని, మూలక వియొక్క భావ గాంభీర్యము గణనాతీతమగుటం జేసి యది యింక ను బొత్తిగఁ బూడి యింకి, నిర్మూలము గాకున్నయది - ఇది మన దేశము యొక్క భాగ్యములలో ప్రాథమికము. మతముల వాతఁబడియు జీర్ణముగాక బ్రతికి యుండుటకన్న మించిన మాహా త్మ్యము త్రిలోకముల మూలమూలగా వెదకినను దొరకదు ! అట్టి మాహాత్మ్యముగల భారతముం దలపోసిన నానందముచేఁ గనుల నీరు గ్రమ్మునే కాని, నాలుక తుదకు మాటలువచ్చునా ! పలుకులు

  • ఇప్పటి భారతము “జయ' యను పేరిటి చిన్న వీర కావ్యముయొక్క పరిణామము. “జయనామకంబునను " రాజితభంగి జగత్రయంబునన్ బూజిత కీర్తియై నెగడు” (స్వర్గా. 89)