పుట:Kavitvatatvavicharamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము 119

ప్రచురించిన రసము సాంద్రముగ నుండును. లేనియెడ బా నెఁడు నీళ్ళలో వైచిన గచ్చకాయంత బెల్లమువలె నది హీన మగును.

రామాయణ భారతముల విషయానుక్రమణిక

          రెండవది . పుట్టె, పెరిగె, నేర్చె, దేశయాత్ర వెడలె నిట్లని వాసిన నొక సంగతిఁ దెలిసినంత నిఁక ముందు ఘనమైన కార్యమో ఫల మో గలుగునను శంక మనకు C గలుగదు. కావున ను ద్వే గముతోఁ జదువు దమను కుతూహలము వొడమ దు. ఇఁక ముందేమి వచ్చునో చూతమని మనసు తహతహ గొనదు. కథయందు నవధానము జీర్ణమగును. ప్రస్తుత విషయముతోఁ దృప్తిఁ జెంది యుందు ము. తరువాతి వృత్తాంతములు తామై నిదానముగ వచ్చు వఱకు ను దేక ములేక వేచియుందు ము. చూడుఁడు. రామాయణ ములో, రావణుడు సీత నెత్తి కొని పోవువ అకుఁ గథ కొంచెము కొంచెము గా విడిచి విడిచి చదివినను ఆయా సము దోcపదు. అటు పిమ్మట "అయ్యో ! సీతగతి యేమాయెనో ! పగదీర్పక శ్రీరాముఁ డూరకుండునా ! యుద్ధ మెట్లు చెల్లినది ! ఆ పరమసాధ్విని రావణు డు చెచినా డా ! ప్రాణములతో నుండనిచ్చెనా ! భర్త యు మఱఁది యు నా మెను రక్షింపఁజాలి రా ! చెఱఁదలఁగినను సౌఖ్య పడె నా ! " ఇత్యాది బహుభంగుల హృదయ మల్లలనాడి యూ పె జీవితము తుదముట్టువఱకు నన్ని వివరముల నెఱుంగ నలజడి గొనును. కావ్యము ముగింపునకు వచ్చినను నా పెపై మనకుండు చింతయు ప్రీతియు గౌరవమును ముగియవు. అనేకులు వాల్మీకి బహిరంగము చేసినది చాలదని, తమ తమిఁ దృప్తి జెందుటకై యయోధ్యలో పట్టాభిషేకానంతర మాయమ్మ యెన్ని క్రీడావినోదం బు ల ననుభవించెనని యూ హించి యూ యమ సుఖము దమ సుఖముగా నానందింతురు. "భోగము లెన్నియున్న నేమి ? ఆనాఁటి పరిభవ మమ్మానవతి హృదయముఁ యు నా ? శల్యమువలె నాటి వేదన యొనర్చకున్నె ? అట్లగుట శ్రీరాములకు వ్యసనము దోఁపఁ గూడదని బయట నాటలు పాటలు నవ్వులు నెన్ని పచరించినను లోన నానాఁటికిఁ గ్రాఁగి క్రుంగకున్నె !" అని యాక్రోశించువా రెందఱు ! మఱి, పారంపర్య నీచమును నీతియని భావించు నితరులు " రాము డు మన యట్టిఁడ ! పరుని యింటఁ గాcపుర మున్న యాలియెడ సందియముఁ దాల్పకుండునా ? తాల్పఁడేని