పుట:Kavitvatatvavicharamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1 16 కవిత్వతత్త్వ విచారము

కాని యీ కవులు వర్ణించిన జాడలును తమ కాలమునాఁటివారి జీవితముచే ఘనముగఁ గాకున్నను నల్పముగనైన నిర్ధారితములు గాన, వీనిచేఁ జరిత్రాంశములఁ గనుఁగొనవచ్చుననియు, భాష యొక్కయు దేశముయొక్కయు చరిత్రమును అన్యోన్య సామ్య ముందాల్చిన యవి గాని యే మాత్రము సంబంధము లేనివగుట యశక్యమనియు, స్థిరీకరించుట యీ దీర్ఘ వ్యాఖ్యానము యొక్క ముఖ్య తాత్పర్యము

     సూరన్న ప్రదర్శించిన య భవ్యశృంగారము, దేశీయుల యనాచారముంబట్టి యేర్పడిన వికార మన్నంతన, యీ కవి నిర్దోషి. యని చెప్పట కష్టము. రస సంపోషణమునకు బ్రతికూలములైన విషయముల పొంతఁ బో నేల ? పో యొcబో యిదియు నుత్తమ నాయికానాయకుల స్వభావమని చాట నేల ! జనసామాన్యముకన్న నెక్కువ సౌమనస్యము లేకుండుటయు నొక కళంకము గదా ! మఱియు అట్టి సౌమనస్యము కవి గలవాఁడని కళాపూర్ణోదయమం బట్టి నిరూపించితి మేని-నిరూపింపఁ గలమను దైర్యమున్నదియాయుత్తమగుణమును ప్రభావతీ ప్రద్యుమ్నము చెయు కాల మునఁ గోలు పోయి యుండుట యొక దోషము. పశ్చాత్తాపముఁ గలిగించు క్షయము ! వయసు హెచ్చుటచేతనో, మఱి యెందుననో, భావనాశక్తి వాడువాఱియుండును ! కల్పనా ప్రతిభ మిక్కుటముగ నుండిననాళ్ళలో వ్రాయంబడినదగు కళాపూర్ణోదయము యొక్క గుణదోష ప్రకటనమును మఱల నందుకొందము.