పుట:Kavitvatatvavicharamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్వితీయ భాగము

మొదటి ప్రకరణము

                                             కాలసరణి - 'హేతుసరణి

కథను వివరించు పద్ధతులు రెండు. విషయముల జరిగినట్లు కాలక్రమానుసారముగా జెప్పట, కాలక్రమమును వదలి స్వారస్య మగు నే సందర్భమునైన ప్రారంభించి పిదప వెనుక ముందఅగా కథను బెంచి పూర్తిచేయుటయు ఇందునకు దృష్టాంతములు. భారత రామాయణములు కాలక్రమానుసారముగా వ్రాయంబడి నవి. ఈ యితిహాసముల లో వీరుల వంశావళులు, వారి జన్మము, వయసు, పెరుగం బెరుగ సంభవించిన కష్టనష్టములు, ఇత్యాదులు కాలో పగతంబైన వరుస మేరకుఁ జూపఁబడియుండుట సర్వజన విదితము. ప్రభావతీ ప్రద్యుమ్నముం గమనింపుఁడు. కాలముంబట్టి కథ నేర్పఱిచియున్నఁ దౌలుత వ జనాభుని వృత్తాంతము, వాని తపో మహిమ , నాకలోక దండయాత్ర, మహేంద్రపరాజయము, వర్ణింపఁబడి యుండును. కవి యిటు నవలంబించిన మార్గము వేఱు. ఇంద్రుఁడు శ్రీకృష్ణదర్శనార్థమై విజయం చేసి ' యని ప్రారంభించి, కార్యమేమని యూతఁ డడుగుcడు , తాను దత్పూర్వ కథ కొంతమటుకు విన్నవించినట్లు కారణములు వెల్లడిచేయుటకు నైన చర్చలచేఁ గథయొక్క యూదిని దీసికొని వచ్చినాఁడు. దీనికిఁ బా శ్చాత్యు లిడిన పేరు ‘తర్క క్రమము' అనఁగా కార్యమునుండి వితర్కించుచుఁ గార్యములు పుట్టుటకు దత్పూర్వమే ప్రసిద్ధికి వచ్చియుండిన హేతువుల నరయుట. తర్క క్రమమను మాటకైన ' కారణ క్రమము' అనుట స్పష్టతరము . కాల కారణ క్రమములకుఁ గల వ్యత్యాసముఁ జూపుట కొక నిదర్శనము : ప్రాతఃకాలమున నిద్రలేచి భూమి తడిగా నుండుటc గాంచితి మేని యా తేమనుబట్టి రాత్రి వానకుణిసి యుండు నను హేతువు దెలిసికొందుము. వస్తువుల స్థితి—అనగా నునికికి వచ్చిన విధమును—పరికించి చూచిన వాన దొలుతటిది. తేమ తరువాతిది. మనకు వస్తువులం గూర్చిన యెఱుక పరముగా జూచినఁ దేమ యూదిమ సత్తు. వాన దానినుండి దెలిసికొనఁ బడిన యనుమానము, కావున స్థితిపరం పరలనిర్ణయింపఁ జూచితి మేని యూదిమధ్యాంతములఁ గాలము
117