పుట:Kavitvatatvavicharamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమ భాగము 1 15

యోజించి యనుష్ఠించిన గుణదోషములు గాన్పించును. యోజన లేక చేయువారికి సందేహ మెక్కడిది, సత్యాసత్య విమర్శ మెక్కడిది ? తాటాకులో వృద్దప్రచారములో ప్రమాణములు. మనసుగాదు, కావున C గావ్యములోని కన్యకలకెట్లో, సిద్ధాంతులకు నారీతినే మనస్సనునది యడుగంటిన ప్రకృతి.

వీరయుగముల స్వాతంత్ర్య మఖండము

మూఢభక్తి ప్రాబల్యమునకు రాని భారత కాలములో ధర్మ ముల యన్యోన్య వైరముం గూర్చిన శోధన లుండెననుటకు దృష్టాంత ములుగలవు. అన్న మాట ప్రకారము తమ్ములు నడువవలసిన వారై నను భీమార్జునులు ధర్మజుం గినిసి తూలనాడలేదా ? సత్యము భూతదయ ఈ రెంటికిని బొత్తుగలుగనిచోట్ల, భూతదయయే శ్రేష్ఠ తరమని కృష్ణుని యుపదేశము. పతులకు లొంగి వినయవిధేయు తలమై నడువవలసిన విధిగలదయ్యు ద్రౌపది సమయముల ధర్మ రాజాది పురు పులఁ గరినా క్ష రంబు గాc జిన్నఁ బుచ్చి పలికి క్షత్రియ ధర్మోద్ధరణంబు గావించి యసదృశకీర్తి వైభవోపేతయై వెలింగెC గదా ! ఈ వెనుకటినాళ్ళ చప్పిcడి పతివ్రతామణు లా మెను మీఱి వెలయువారా ? చవి సారములేని పాత్రములకు దారిచూపినది రామాయణము . భరతుcడు మొదలగువారు నిర్వికల్పులు. భారత వీరులు సవికల్పులు, మనుష్యులు, దారుయంత్రములు గారు. " సంతతక్షముండు సంతతతేజుండు నగుట పాపమందు రనఘ మతులు" అని ‘తాcబట్టిన కుందేటికి మూఁడే కాళ్లు" అని వాదించు మూర్థమానసులC దీసివైచినది ద్రౌపది. ఆమె దివ్యచారిత్రమే నుత్తమ నిదర్శనము. పౌరుషము గలవారు విమర్శము , కారణశక్తి, నిర్భయ హేతువాదము, వీనిం జూచి జడియరు. దైన్యముంగుడుచు శుష్క సత్త్వలకు నన్యశాసితములగు నాచారా దులు ప్రధానములు. స్వాతంత్ర్యము లేనివారగుటచే స్వేచ్ఛా యోజన ప్రాగల్భ్యము వారికి నలభ్యము. ఇఁక విమర్శనము. కార gదాను సార ప్రచారము, ఇవి యెక్కడివి ?

"హిందూ దేశములోని కవులు స్వబుద్ధి నుపయోగింపక శాస్త్ర ములు, ప్రాచీన గ్రంథకర్తలు, పోయిన దారినే గొట్టెలమందవలెఁ బోయినవారగుట వారి కావ్యములఁ బరిశోధించుటచే నా కాలమున దేశస్థితి జనుల నడవడి ఇత్యాది చారిత్రకాంశముల గుఱుతెఱుంగుట దుర్ఘట" మని యొకానొకరు నుడివిరి. ఇందు సత్యము లేకపో లేదు.