పుట:Kavitvatatvavicharamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ భాగము 113

న్యాయము, స్త్రీల కొక న్యాయముగా నేల విధింపఁబడెనో చెప్పవారు లేరు ! అది యుటుండనిండు! స్త్రీయనునది జడము గాదు. తిర్య గ్జంతువుఁ గాదు. ఆత్మ గలిగిన మనవంటి చేతనము. మన మేరీతిని స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, కొడుకులు, భార్యలు (బహువచనము హిందూ జనులలో నయోగ్యము గాదు) మొదలగు ప్రాణసములతో సహేతుకముగనో, నిర్హేతుకముగనో, కాలవశమున భేదింతు మో, ఆరీతినే స్త్రీలును భేదముఁ గొనకుండుటకు వారేమి యంత్రములా ! మానవులు గారా ? భేదమును గొనినంతనే మనల నెవ్వరుఁ దుచ్ఛులని గణింపరు. మఱి కారణము లారసి తీర్మా నింతురు. మనలో స్త్రీ నడవడి (గూర్చి సిద్ధాంతము చేయునపుడు ఖండన మే గాని విచార మెక్కడిది ? అట్లగుట గొప్ప బుద్ధిచేఁ బ్రేరిత మైన భర్త మీఁది విరక్తి యనునది యొక టున్నదని మనవారికిఁ దెలిసినను, బహిరంగము గ నొప్పకొనరు. కావ్యముల నిట్టి చిత్ర చరిత్రలు వర్ణింపఁబడి యుండలేదు. చూడు Cడు. తన భర్త కులాభి మానము విడిచినవాడైన బత్ని యేల వానిని వదలరాదు ? అన్యా సక్తుడై యిచ్చిన బాస మఱచినఁ దనకు నట్టి మఱ పేల రా ఁదగదు ? లంచము కొఱకో పగచేతనో మాతృద్రోహముఁ జేయువాఁడై తన దేశము నకు నా శముఁగోరి శత్రురాజులకు సాయము చేయC కడఁగెడు దు రాత్ముని భార్య శిరశ్ఛేదనముఁజేసిన నకృత్యమా ? సుకృత్యమా ? మఱి దేశ భక్తుడై నిరంతర యత్నములచే దేశాభ్యుదయము నభి వృద్ధి జేయువాని నేల ప్రీతిపాత్రుడని చేరువఁ జేర్చికొనరాదు ? ఒక పతివ్రతా ధర్మమున్న నిం కేధర్మములును బనికి రావా ? అవి అస్తమించునా ? వాని ను పాసింపకున్న నవి క్రీడు తేకుండునా ? ఈ పాడు పాతివ్రత్యము నుద్ధరించు ప్రకృతియొక్క గృహము మాత్రమె . అదియే పతిభక్తికి రంగస్థానము l దేశోద్ధారక ధర్మములకైనను నిది యొక్కువయా ? అలనాఁడు మహమ్మదు గోరీకి నాహ్వాన సందేశ మంపి దేశము నొరులకు సమర్పించిన జయచంద్రున కతని రాణి విష మో తవుడో పెట్టియుండిన నామె కొక దేవాలయము కట్టించి పూజ సేయ కుందు మా ? పతిభక్తి నేటఁ గలిపిన వారందఱు నొక్క లెక్కయునుట మున యూ చారము ! పతులను గుణముల (కొలది వర్ణించి వారి ని విసర్జించిన భార్యల యుద్దేశములను గారణములను గణించి, వీరియందును గౌర వలాఘవముల నిరూపించి చూచితి మేని, భర్తను వదలినవారిలో ననేకులు మహాత్మురాండ్రని యేర్ప డును. మఱియు వదలినవారిలో న నేకులు పేద బుద్ది గలవారని,