పుట:Kavitvatatvavicharamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112 కవిత్వతత్త్వ విచారము

దుర్నిరోధము. ఇది స్వభావసిద్ధమని యంద ఱెఱింగియుండియు, నైరోపా కవులు ప్రయోగించినట్టు ఈ న్యాయము మనవారు తమ కృతులలో వ్యాప్తికిఁ దెచ్చియుండలేదు. మీఁద వివరించిన భ్రమలవలనఁ గలిగిన క్షోభములు రెండు. రాజుగారు దేవి నొకదాని సంపాదించి పురమున నూరేగునపుడు పౌర స్త్రీ లందఱుఁ గామాతురతమై వానింజూడ పరిపరి వికార వేషము లతో వచ్చిరని ప్రబంధముల వర్ణింపఁబడి యుండుట. ఈ కవుల యూహ యేమనఁగా “రాజు ! ఇంక వానిం గల య (గోరక తరుణు లెట్లో ర్తురు ! మనము రెండణాల దక్షిణ నాశించి యే తారతమ్యముల నెంచక ధనికులను దొంగభక్తి నాశ్రయించుచున్నాము గదా! స్త్రీలును, మనకన్న నెట్లు శ్రేష్ఠలు! నికృష్ఠజన్మలే గావున వారిలో నిట్టి పిచ్చి యెక్కువ !" యని కాఁ బోలు ! రెండవది " భర్త దేవుఁడు. గుఱుక పెట్టెడు ప్రాణాయామబ్రహ్మ ! వాని నే యంశ మందైన మీఱినవా రెవ్వరు లేరు. ఒక్క లేరనుటయే కాదు. సృజింపఁ బడరు. పడఁ జాలరు !" అని భక్తిఁ దాల్చియుండవలయునను పాతివ్రత్య ధర్మ ప్రకటనము, ఏమి యీ జనులకుఁ గల దైన్యమహిమ ! పరిపూర్ణు లని తలంపCబడరేని భార్యలు చీ యుని వదలిపో దురా ! భార్యలు మాత్ర మంత పరిపూర్ణలా ? మనుష్యులలో మనుష్యులమని యెల్లరు నున్న సంసారము సా (గదా ! మఱి సభలకుఁ బిలిచి కొని పోయిన వివేకానందస్వామి, గొకలే మున్నగు మహనీయులం గాంచి, "వీరు గొప్పవారు" అని భార్యలు మెచ్చి కొని రేని, మనసు మాఱినవారౌదురను భయముం దాల్చు మగవారి నీచతకొలఁది నిర్ణయింపఁబోలునా? స్త్రీలు గుణము కొలఁది వలచువారైరిపో. అది గ్రేయో హేతు వేగాని యనిష్టసాధక మా ? వారి హృదయానందము నర్థించియైనఁ బురు షార్థము సాధింపఁ జూ తు ముగదా !

మోహ ప్రకృతి

మన గ్రంథములలో చిత్తవిజ్ఞాన మత్యల్పము. అనఁగా పూర్వ కావ్యములఁ దప్పఁ దక్కిన యర్వాచీన గ్రంథములలో ననుట. పురుషుc డెందఱ స్త్రీలనైన గోరవచ్చునఁట! తప్పులేదు! తప్పేల ? దక్షిణ నాయకుఁడు ! కృష్ణమూర్తి ! స్త్రీలు అన్యపురుషులమీద మనసు పోనిచ్చిరేని, అయ్యో ఎంత పాపము ! పాతాళమును మఱింత లో c తుగా ద్రవ్వినఁగాని యా పాపము నింపలేము ! కన్ను గదల్చినజాలు ! ఆపె బంధకి ! దుర్మార్గురాలు ! మగవారి కొక