పుట:Kavitvatatvavicharamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1 14 కవిత్వతత్త్వ విచారము

పిఱి కివారని, నీచాత్మురాండ్రనియుఁ దెలియక పోదు !

ఏదేని యొక్క ధర్మమును మాత్రము పట్టి మనుష్యుల చరిత్రల గణింపఁజూచుట మౌఢ్యము. అందును ఆ ధర్మమునుండి తొలఁగిన వారి స్వభావము, స్థితిగతులు, కారణములు, కాంక్షలు, వేనినిం బాటింపక తీర్పుచేయుట కన్నులు పోయి న కబోది మతము. దీనిచేఁ గావ్యములకు గొప్ప లోపము సంభవించినది. ఏది యన, శృంగార మనిన నేక విధమైన శరీర రాగమని యెట్లు భ్రమించిరో, యట్లే జారశృంగారము నేక గతిం బో వునది యని యోజించి, నరుల మనసులు నానారూపములైన చిక్కులం దాల్చిన వనుటఁ దెలిసికొనక, విసుగు పుట్టించునంత యభిన్నవర్ణనలC జేయు దౌర్భాగ్యము. జార స్త్రీ లెల్లఁ జెడ్డవారయఁట ! కండకావర ముచే నన్యులC గోరు వారcట ! ప్రబంధముల లోని పతివ్రతలు మాత్రము కండకావరము చేఁ గోరు వారు గా రా ? ఇంకే వరము వారి కున్నది ? శృంగారము నీచశృంగారము. దానికి ఁ దగినట్లు జారత్వ మును నీచముంజేసి జతఁగూర్చిరి. మనుష్య స్వభావమును బరీక్షించి వ్రాయక యలంకారశాస్త్రములఁ దలనిడికొన్నందుకుఁ గలిగిన యధోగతి యిది !

సరాసరికి నీగృహకృత్య పతివ్రతలకన్న నైరోపా మొదలగు వృద్ధిభూములలోని పలు గాకులు మేలు. రుష్యావారికిని జపాను వారికిని కొన్ని యేండ్లక్రింద ఘోరయుద్ధము ప్రాప్తమైనపుడు, రుష్యావారి రణసన్నాహముల యొక్కయు, కోటలయొక్కయు, సైన్యముల యొక్కయు మర్మముల నెఱుంగ జపాను రాజ్యములోని నారీమణులు కొందఱు బుద్ధిపూర్వకముగ వేగుపనికిఁ బూనినవారై, తరుణములందు శత్రు సేనానాయకుల పరిరంభణములకుం గూడ సమ్మతించి, యమూల్యవృత్తాంతములను దేశమునకు దానముచేసి యుపకార రాజ్యపట్టమహిషులైరని వినియున్నాము గాదె ! వీరిని నీచ చరిత్రలని భావింపనొప్పునా ? గృహధర్మము , దేశ ధర్మము విరుద్ధగతులం బో వునవియైనచో దేశ ధర్మము నెడ నెక్కువ గౌరవ ముఁ గలవా రా నికృష్టులు ! గృహమునకు మించినది లేదను వారా ? యోజింపుడు ! దృష్టి ననుసరించి కొలఁదు లేర్పడును. సంఘపరమైన దృష్టితో తత్త్వపరిశీలనము చేయువారికి హిందువుల నీతులు మొత్తముమీఁద హీనములని తోcపక మానపు. ధర్మముల పరస్పర ప్రాతికూల్యము ఐరోపియనులు విమర్శించినట్లు మన వారు చేయలేదు. కారణము, మూఢభక్తిపరాయణులు గావున.