పుట:Kavitvatatvavicharamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ భాగము 109

యన్యముగాదు. యౌవనము మంచిది. ముదిమి చెడ్డది. అట్లగుటచే దేవతలు నిత్యయౌవనులనియు, మనము యజ్ఞములఁ జేసిన నిత్య యౌవనుల మగుదుమనియు మనుజుఁడు పేరాశచే నెంచు చున్నాఁడు . నిత్యయౌ వనమున్న రంభ లుండవలయు. లేనిచో నది నిష్ఫలము. ఈ రీతి నైహికముల ననుసరించి యీ ప్రపంచమున మనకు C గల సుఖములు, ఆశలు అను సామగ్రితోఁ గట్టCబడిన మాయా లోకములే వైకుంఠము, కైలాసము మొదలగు పరమ పదవులు. తుదకు దేవునినైననుసరే, మనుషులం బోనివానిగా నూహించుచున్నామే గాని, యతఁ డతీతుఁడని నోటిమాటయున్నను భావమున నట్టి Cడుగా సాక్షాత్తరింపఁజేయుట యసాధ్యము. అతనికి వేయిచేతులున్నవని సిద్ధాంతముండెఁబో ! వేయి మనదిగాకున్నను చేతులను వస్తువులు మన వేగదా ! మన యొక్క యంగములు, ప్రాణము, మనసు వీనితో నే మాత్రము సాదృశ్యములేని భగవంతు నొకనిఁ గల్పించి స్మరించుట యలవియా ? యోజింపుఁడు ! అట్లగుటC గా వ్యవర్ణనములును అనుభవబద్ధములగు పేమి వింత ! అవి యీ లోకములోని రసములను ప్రకటింపఁజేయు కృతులు. కావున సంఘములో నుండు సౌరభ మో దుర్గంధమో వానియందును బర్వియుండుట నైజము . అనివార్యము. రాజకన్యకయయ్యు, దేవేంద్రుని జయించినవాని కూఁతురయ్యు ప్రభావతీదేవి పచ్చిపచ్చి కూఁతలఁ దన మధురమైన నోటితోఁ బ్రేలుట మనకుఁ దలఁపఁగా నెంతో జుగుప్స ! శుద్ధాంత కాంతామణియcట ! ఇఁక చర్యలో

ఉ. “వావిరి నెల్లప్రాద్దు. . . (ఇవి వెనుక నుదాహరింపఁబడినవి) మ. కలలంగూడిన . . . . . . . .

చర్య లట్లున్నను నష్టములేదు. ఆమె మూట లంతకైనఁ బచ్చివి !

“మనసునఁ గాకున్న మాటలయందైన

సౌకుమార్యములేని చానలేల ? "వారి యందు స్త్రీయను శబ్ద మ ప్రయుక్తము . వాస్తవము విచా రించిన నీలో పములకు c గారణము మన దురాచార హేయ జీవితమే

గదా ! శుద్ధాంతములఁట ! " పో ( తుటి (గ కైనం బొలయ రాని చోట్లCట !"

శుద్ధాంతవాస ప్రభావము

సరి ! కల లకు గోడ లడ్డమా ! మనసునకు బీగములు బంధ