పుట:Kavitvatatvavicharamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110 కవిత్వతత్త్వ విచారము

ములా ! శుద్ధాంతము లేర్పఅుచుట యను లఘు కార్యముచే శుద్ధాంత రంగములు సమకూ అునా ? మఱియు, నీ మఱుఁగే గదా మానము విడుచుటకుఁ బేరకము ! ఎట్లన, ఇట్టివారు చెలులు, దూతి కలు, దాసీజనులు మొదలగు మధ్యవర్తుల మూలముగా C దప్ప నితరము ෆෆෆ నుత్తమమార్గములఁ దమ నైజమగు వలపును దృప్తి C బొందింపఁ జాల రు . మధ్యస్థము పిలిచిన పిమ్మట మౌనము (గొని యుండు టెట్లు ? మఱుఁగుగానైన సగము చూపి చూపక యుండు టెట్లు ? శుద్ధాంత మనఁగా సేవకులు మొదలగు నీచులతో సావా సమన్న మాట ! గరువతనము కిది యనుకూల మా ? మఱియు, నట్టి కన్య లకు నితర చింతలే యుండవుగాన తమ చింతయే ప్రధానము. రాజ్యము, దేశము, జ్ఞానము, ధర్మము , వీనింగూర్చిన విచారములు సున్న. అప్రయోజకముగా నుంచcబడి యుండుటచే మనసు పరిశ్రమలేక కృశించి నశించును. ఇట్టివారు స్వసుఖ పరాయణు లగు పేమి చిత్రము ? మఱి సుఖ మనఁ గా వీరికి దేహసుఖమనుటఁ దప్ప నింకే యర్థమైనఁ గలనైనఁ దో (పగలుగునా ? ఏ పనిపాటు లును లేక తిని, కండ క్రొవ్వి, మదాంధలై కాలము భారముగ నుండునట్టి జవ్వనులు శుద్ధాంతముల నున్నను సంతసానులట్ల ప్రవర్తింతురు. విచ్చుకత్తుల పా రా లెక్కువయా కొలఁది సందు దొరికి నంజాలు ! సమయము వ్యర్థపుచ్చక త్వరలో ఁ గార్యము దీర్చు కొందమను తొట్రుపాటును గలుగును. అది యుదయ మయ్యెనేని, మానము, మఱుఁగు , సౌమరస్యముఁగల శృంగార మెక్కడిది ? శృంగారమునకు బదులు జావళీలు వచ్చి చేరును. పాపము. మన దేశములో నెందతో స్త్రీలకు దూతికాముఖమైన మోహమే గదా గతి ! కన్ను లుపయోగింపఁబడనందున వీరి కవి మందము లగు నేమో ! చెవులు అనవరతోద్యోగములో నుండునవిగాన చుఅుకుగల వగు నేమో ! చిత్ర ఫలకమో, చెప్పడుమాటయో కామసందేశ పద్ధ తులు ! ఇవి దప్ప వేఱుమార్గములు మృగ్యములు !

   "పురుషుఁడే దేవుఁడు ప్రస్వేద గ్రాత్రుడైనను అ స్వేద గాత్ర తుల్యుఁడు" అని పద్మగంధులు యోజించుటకు ను యో జింపఁ జేయఁబడుటకును గల కారణములలో శుద్ధాంతనివాస మొకటి. ఎట్లన, బయట ఁ బోయినఁగాని లోక వర్తమానము లెఱుకకు రావు. కూపస్థ మండుకముల కా కూప మే పాలసముద్రము. రాజ్యాంగముల నుద్ధరించుటలో నిపుణులైన మంత్రులు, దేశభక్తిచే విరాజిల్లు ప్రతినిధులు, యుద్ధరంగమున శత్రువుల నోడించి నిత్య యశో