పుట:Kavitvatatvavicharamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10.8 కవిత్వతత్త్వ విచారము

శుచిముఖి వాగ్దర్పంబున విప్పి చూపుటలో

"చ. కొనరక చూపుచేతఁ గడు గ్రోలిన నిచెలువంబు చెల్వమా
నసమున నెంత మిక్కిలి పునంబుగ హత్తెనొ కాని యప్ప డో
రసిక శిఖావతంన యదురత్నమ కాకరకాయ రీతిగాఁ
 గిసలయపాణి చన్నుఁగవ క్రేవ గగుర్పొడిచెం బొరింజౌరిన్."

'కా కరకాయ' యు (ట ! ఎండు జిల్లెడు కాయ యున రాదా ! పంతముఁబట్టి యే పైన గుణములు బలాత్కారముగ లాగివేయఁ జూచినచో విఱుపులు తప్పవు.

ఈ కథలోనుండు పక్షులకు వంశమూలములైన పాత్రములు కళాపూర్ణోదయములోని చిలుకలు. ఈ విషయమునందును ప్రభావతీ ప్రద్యుమ్నము తత్పూర్వగ్రంథము ననుసరించియున్నది. సరస్వతీ దేవి చిలుక యు , ఇంద్రుఁడు రంభ తో మణికంధరుని తపో భంగ విషయమైన సందేశము నానతిచ్చిన విధంబును గల భాషిణితో దెలుపు చిలుక యు, శుచిముఖికిని, సునాభుని సుతలకు దూతిక యైన క్షీరమునకును గొలము సాములు. ఈ కవికి బక్షులయం దాదరము ఎక్కువ కాcబోలు !

తుచ్ఛ శృంగారములకుఁ గారణములు మన యునాచారములు

ప్రభావతీ ప్రద్యుమ్నములోని దోషములంగూర్చిన ప్రస్తావము మనసు గట్టిచేసి యెట్లో చేసితిమిగాన, కవిపరమైన ప్రతివాదము లును ఇట సమర్పింపంబూనుట సహజమును సంతోషకరమునైన ధర్మము . శృంగారరసవిషయములగు నా భాసములకుఁ గవి కాదు ఉత్తరవాది. మఱియట్టి యనిష్టములే యింద్రభోగములని రోతఁ జెందక గ్రహించు మన సంఘము ! భావనాశక్తి యెంత యుద్ధురమై యుండిననేమి ? హనుమంతుఁడు సముద్రము దాఁటఁ జాలినను దన నీడఁ దా దాఁటఁ జాలునా ? అట్లే , తన యావజ్జీవము నెట్టి స్థితిగతుల నడుచునో వాని సాంగత్య మేమాత్రములేని తలంపులను దెచ్చుట తరముమీఱిన కోరిక. ఇందులకు మతతత్త్వములనుండియే ప్రబలప్రమాణములఁ జూపవచ్చును. దేవలోక మననేమి ? ఈ లోకములోని సుఖములు లభించుటకు నాస్పదమైన పదవియే కదా! అనఁగా నీ లోకములోని దుఃఖములు నిర్మూలింపఁ బడినట్టును సుఖములు అమేయములైనట్లును భావించిన దేవలోక మేర్పడును. పర మనునది యిహముచే సృజింపఁ బడిన ప్రతిబింబ మేగాని