పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

91


అను నాటకమును చూచుట మా కిరువురకుఁ దటస్థించినది, రెండు మూఁడు గంటల వినోదము కొఱకును, ఆ వినోదముస అలక్షితముగ మిళితమైన రీతిని సమకూరుచుండు భావ శిక్షణము కొఱకును మనము సాధారణముగ నాటకశాలకుఁ బోవుచుందుము. చేతిడబ్బు వదలించుకొని, నిద్రలేమి మున్నగు శ్రమలకుఁ బాల్పడియు మనము నాటకము చూచుట కవిచేతను నటకులచేతను “మీరు సభ్యతా శూన్యులు! మీరు మృగప్రాయులు ” అని చెప్పక చెప్పించు కొనుటకుఁ గాదు. సహృదయుల భావములు దూషింపఁబడుటకు గాదు ! కాని, దురదృష్టవశమున మా కానాఁ డట్టి యసభ్యవినోదము ప్రాప్తించినది. ఆ నాటకమునందలి యనౌ‌ చిత్యముల నుదహరించి సభ్యలోకమునకు విసుగుపుట్టించి నా యభిరుచినిగూడ దూష్యముగ నొనరించుకొనుటకు నా కిష్టము లేనప్పటికిని 'శిల్పము' కొఱకు అట్లు చేయక తప్పినది కాదు. మేము నాటకశాలయం దున్నంతవఱకు జఱిగిన కథ యీ క్రిందివిధముగ నున్నది: భాగ్యవంతుడైన బ్రాహ్మణయువకుఁ డొకఁడు ఒక భోగముసాని నుంచుకొని తన యాస్తినంతయుఁ గొల్లగొట్టుకొనును. కొంతకాలమునకుఁ దన భార్యనుగూడ ఆ సానికిఁ బరిచారికనుగ నియమించును. అటుపైన కొల్లఁగొట్టుటకు విటునియొద్ద నొక గవ్వయైనను లేదని తోఁచిన వెంటనే ఆసాని యాతనిని విడనాడి, మఱియొకనిని దగుల్కొనును. రెండవ విటుఁడును ఆ భోగ ముదియు నేక శయ్యాగతులయి యుండునప్పుడు పరిత్యక్తుఁడైన మొదటి విటుఁడు వచ్చి చూచి “బ్రతికి చెడిన వాని