పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

కవికోకిల గ్రంథావళి


వైరాగ్యావేశముతో " ఆసానిని దిట్టుటకుఁ ప్రారంభించును. భోగమువారిని దిట్టుటయే సంఘ సంస్కరణము యొక్క ప్రధానసూత్రమని తలంచువారును కొందఱు గలరని, అట్టి కోటిలో మన నాటకరచయితనుగూడ చేర్చుకొని నాటకము నందలి ఆ సంవిధానమును సహించినను, సహింప నలవిగానివి మఱికొన్ని బయలుదేరినవి. ఆ నాటకశాలయందు స్త్రీలు చాలమంది యుండిరి . ఆతిట్లు భోగమువారికి సంబంధించినవే కాక సామాన్యముగ స్త్రీజాతికంతటికి సిగ్గును రోఁతను బుట్టించునట్లు తోఁచినవి.*[1] "సాని వాకిటిలో నొకనిని, ముందువాకిటిలో మఱియొకనిని పెట్టుకొని చిత్తకార్తిలో కుక్కలవలె ......... వారి ......... సొరకాయలవలె నుండును; అవి...... కావు. సోగములబొందలు”. మొదటి మాటతో నిప్పుఅంటింపఁబడి రెండవమాటతో కిరసనాయిలు పోయఁబడి, మూఁడవమాటతో భగ్గని మండిన నా హృదయము సంయమన సాధ్యముకాక పోయినది. ఏవో రెండు మాటలని నాటకశాల వీడివచ్చితిని. రెడ్డిగారును నా వెనువెంట వచ్చిరి. బయటికివచ్చి మనము స్తిమితపఱచుకొను నప్పటికి నా యొడలంతయుఁ గంపించుచుండెను. నాటకము ముగిసిన వెనుక మా దుర్ణయమును గుఱించి ఆ సమాజము యొక్క కార్యదర్శి యుసన్యసించెనని వింటిమి,

మఱుఁనాటి యుదయమున ఆ సమాజములోని యొక సభ్యుఁడు, తాము రాత్రి ప్రదర్శించిన నాటకమును, చింతామణియను నాటకమును దీసికొనివచ్చి, ఆ నాటకము చింతా


.

    • నాటకము నాయొద్దలేదు. జ్ఞప్తియున్నటులు వ్రాయుచున్నాను