పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

కవికోకిల గ్రంథావళి


లోకోత్తర వీరుఁడైన శ్రీరాముని చరిత్రమును సృజించి నప్పటికిని, సమకాలీనమైన హైందవ సంఘముయొక్క నాగరకతయు ఆచార వ్యవహారములును అందు నంకితమైయుండక తప్పవు.

ప్రస్తుతవిషయమునకు వత్తము : మన తెలుఁగుజూతి చాల మంది కవులకును, శిల్పులకును, నటకులకును ఆకరమై యున్నది. వారి రచనలు, సృష్టులు, అభిప్రాయములు భావి సంతతికి మన కళాభిరుచిని, కల్పనానైపుణ్యమును, ఔచిత్య గౌరవమును, మీఁదుమిక్కిలి మన శిక్షణమును, దెలియఁ బఱచును కావున ఇప్పటి కవులును, తక్కుంగల శిల్పులును సమకాలీన ప్రజా బాహ్యుళముయొక్క యశిక్షితమైన యభిరుచి యడగులకు మడుఁగులొత్తి సునాయాస లభ్యమయినఁ గీర్తికొఱకు పాటుపడుటయే వారి బాధ్యతయని తలంచు కొనక, భావిసంతతులకుఁ గూడ మన శిల్పసిద్దిపైని గౌరవ ముండునటులు, తమ యభరుచిని మఱికొంత సభ్యముగను, ఔచిత్వదృష్టిని మఱికొంత : నిశితముగను అలవఱచుకొనుట యావశ్యకము.

సుమా రొక సంవత్సరము క్రిందట ఒంగోలునందుండిన నామిత్రులు రావు సాహెబ్ డాక్టరు శేషాద్రిరెడ్డిగారికి (ఇప్పుడు స్వర్గస్థులు) అతిథినై యచ్చట రెండు మూఁడు దినములు గడపితిని. ఆయూరియందు స్థాపింపఁబడియున్న యొక నాటక సమాజమువారిచేఁ బ్రయోగింపఁబడిన[1] *సుమతి

  1. ఆ నాటకము పేరునుగుఱించి నాకు సంశయము గలదు, నుమతి యని జప్తి, కవిపేరును మఱచిపోతిని.