పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

ఉపోద్ఘాతము

సంఘసమష్టి తనయందలి వ్యక్తిని నైతిక బంధములఁ జిక్కించుకొని యెట్లు అధికారముచేయునో, ఒక్కొక్కప్పుడు వ్యక్తియుఁ దన సంకల్ప బలముచేత సంఘసమష్టిని తన యభిప్రాయమువంకకుఁ ద్రిప్పుకొనుచుండును. ఇందుకు మన సాంఘికజీవితమునందు లెక్క లేని నిదర్శనములను జూచుచున్నాము. సంఘమునకును, అందలియంశమైన వ్యక్తికిని బరస్పర సంబంధము గలదు. కావున నొక జాతి నాగరక మైనదని చెప్పుటలో నూటికి తొంబైమంది మనుష్యులైనను నాగరకులుగ నుందురని మన మూహింతుము.

జాతీయ జీవితమార్గము కొండదారివలె నిమ్నోన్నతముగ నుండును. వాతావరణములోని మార్పులను భారమితి (Barometer) సూచించునటుల శిల్పము జాతీయ జీవితమునందలి సీచోచ్చదశలను దెలియఁ జేయుచుండును. కవులు స్వతంత్రముగ వస్తుకల్పనము చేయుచున్నను, సమకాలీన భావములును, ఆచార వ్యవహారములును వారి రచనల యందుఁ బ్రవేశించియుండును. . కాళిదాసుని నాటకములను మనము చదివినయెడల ఆ కాలపు నాగరకతను మనము కొంచె మించు మించుగ నూహింపఁగలము. వాల్మీకిమహాకవి