పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

88

కవికోకిల గ్రంథావళి


ముగఁ బరిణమింప మొదలుపెట్టెను. తత్పరిణామ చిహ్నములు ఇప్పుడిప్పుడు తెలుఁగు కవుల రచనలయందు బొడకట్టుచున్నవి. కాని, యిది ప్రథమదశ యగుటవలనఁ గొందఱి రచనలయందు అనవసర పదాడంబరత్వమును, కళా కౌశలమువలనఁ బ్రాప్తమైన భావనేంద్రజాలముగాక భావ ప్రకటనము: గావింపఁజాలని గజిబిజితనమును గోచరించుచున్నది. ఈ లోపము మొట్టమొదట అనివార్యమైనది. కావున సహింపఁదగినది. ఇందుకు లక్ష్యములుగ సమకాలీనుల కావ్యములనుండి కొన్ని యుదాహరణములను సంకలింపవచ్చును గాని, అనవసర వివాద హేతువుగఁ బరిణమించు నని మానితిని.

సంపూర్ణము.


___________