పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కవికోకిల గ్రంథావళి


అంతకు మించిన సంతోషము నతఁ డెఱుఁగడు. రెండవ దశ యందుఁ బ్రాపంచిక జ్ఞానము కొంత యుదయించి, మనో వికృతులు శిక్షితములయి శాస్త్రములు, శిల్పములు మున్నగువాని మూలమున నానందముఁ బొందును. మూఁడవ దశయందు రానురాను ఆతనిజ్ఞానము విశేషముగ నభివృద్ధినొంది పూర్వమున కన్న శాశ్వతమైన యానందము నన్వేషింప మొదలిడును. అదియే యమృతానందము.

'ఏకం రూపం బహుధా యః కరోతి. .....
 తమ్ ఆత్మస్థం యే౽ను పశ్యంతి ధీరా,
 తేషాం సుఖం శాశ్వతం నేత రేషామ్.

ఒక రూపమును బహురూపములుగ నెవ్వఁడొనరించు చున్నాఁడో, ఆత్మస్థుఁడైన ఆపరమాత్మను ఏ ధీరులు దర్శించుచున్నారో వారు శాశ్వత సుఖమును బొందుదురు. అన్యులు పొందరు. *[1]శిల్పము తన యాదర్శకమును క్రమక్రమముగ మార్చుకొని, యెట్ట కేల కీ శాశ్వత సుఖమును మానవుల కందింపఁగల యంతటి యున్నతపదవికి నారోహించినం గాని, కృతకృత్యము కానేరదు.

సంపూర్ణం

____________
  1. *Fine art is not real art till it is in this sense free, and only achieves its highest task, when it has taken its place in the same sphere with religion and philosopby.

    --Hegel

    Philosophy of Fine Art