పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

35


జెప్పియుండుటవలన సంస్కృతలాక్షణికులకుఁగూడ, శిల్పము స్వతంత్రసృష్టి యను నిర్వచనము సమ్మతముగ నున్నట్లు దోఁచుచున్నది.

అపూర్వ వస్తునిర్మాణమునందు కావ్యశిల్పము ప్రకృతి సృష్టిని మించుచున్నది; కావుననే కళకు ప్రత్యేకమైన స్థితి కలిగినది. జంగమ వల్లులు, నిశ్చల చంచలా లతికలు, నొక్కిన పాలుగాఱు చెక్కిళ్ళు, పుప్పొడికట్టల నొ'రసి కొనుచు ప్రవహించు తేనె వాకలు, ఆకసము నంటు మేడలు మున్నగునవి కవికల్పనములు; వాస్తవజగత్తులో లేనివి.

లయవిభాతి

చలువగల వెన్నెలల చెలువునకు సౌరభము
         గలిగినను, సౌరభముఁ జలువయుఁ దలిర్పం
బొలుపెసఁగు కప్పురపుఁ బలుకులకుఁ గోమలత
         నెలకొనిన, సౌరభము జలువ పసయుం గో
మలతయును గలిగి జనముల మిగులఁ బెంపెసఁగు
         మలయ పవనంపుఁ గొదమలకు మధురత్వం
బలవడిన, నీడు మఱి కలదనఁగనచ్చుఁ గడు
        వెలయఁగల యీ సుకవి పలుకులకు నెంచన్.

ఈపద్యమునందు పింగళి సూరనార్యుఁడు ప్రకృతిపై నొక పంతము వేసినాఁడు. వెన్నెల చెలువునకు సౌరభము గలుగవలయును! కప్పురమునకుఁ గోమలత నెలకొనవలయును! పై గుణము లెల్లను గల మలయపవనమునకు మాధుర్య మలవడవలయు ! అప్పుడుమాత్రమే అది సుకవి