పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

33

యనుకరణ మనియే విశ్వసించుచుండిరి. కాని; [1]అరిస్టాటలు నిర్వచించిన అనుకరణము (Imitation) నకును మనమిప్పుడు అనుకరణ మను మాటకుఁ జేసికొను నర్థమునకును జాలభేదమున్నది. ఆయన యుపయోగించిన పదము విశాల భావగర్భితముగ నున్నదని ఆయన యొనరించిన నియమములు వలననే మనము తెలిసికొనఁ గలము.

శిల్పము తన మాతృకను ఉన్నదియున్నట్లు అనుకరింపక యింద్రియములకు గోచరించిన విధమునఁ బునర్నిర్మాణము చేయుననియు, ఆదర్శప్రాయ మగు మానవజీవితము, ప్రవర్తనములు, చర్యలు మున్నగునవి శిల్పమునఁ బ్రతిబింబించు చుండు ననియు అరిస్టాటలు చెప్పియున్నాడు. [2]ఇందువలన శిల్పి యనుకరించువాఁడు గాఁడనియు, రసార్ద్రమైన యాతని భావమున నింద్రియముల ద్వారా ఏవేవి యంకిత మగునో దానిని మాత్రమే మూర్తీభవింపఁజేయు ననియుఁ దేలు


  1. అరిస్టాటలు కవిత్వతత్త్వ నిర్వచనములను సుపూర్ణముగఁ దెలిసి కొనవలయునన్న ప్రొఫెసర్ బుచ్చెరుగారి "Aristotel's theory of poetry and fine art" అను గ్రంథమును జదువవలయును.
  2. (1) The art may imitate things as they ought to be.
    (2) A work of art reproduces its original not as it is in itself, but as it appears to the senses.
    (3) A work of art is in idealised representation of human life.....of character, emotion, action, under for me manifest to sense.

    - Aristotel.

    (Butcher's translation.)