పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

కవికోకిల గ్రంథావళి


5. కవిత్వ శిల్పము—అనుకరణము

కవిత్వము లలితకళలకుఁ జేరినది కావున, నిచ్చట శిల్ప విచార మనివార్యమైనది. శిల్పము నిదర్శక మనియు నాదర్శకమనియు రెండు విధములు. కొంచమైనను భేదము లేక ప్రకృతి ననుసరించునది. మొదటిది. వలసినంతవఱకు ప్రకృతి సనుసరించి దానిని మించిపోవునది. రెండవది. మొదటిది మాతృకకు సరియైన నకలు; రెండవది, స్వతంత్ర కల్పనము. శిల్పులు భూమ్యాకాశములందు సంచరించు రససిద్ధులు, కావున వారి సృష్టియు మర్త్యలోకమునకును స్వర్గలోకమునకును సంబంధించి యుండును. నిదర్శ కాదర్శక శిల్పములలో రెండవది యుత్తమమైనది. ఒక రూపమును పొల్లుపోక యనుకరించి చిత్రించుట నయనేంద్రియము యొక్కయు బుద్దియొక్కయుఁ గార్యము. కాని, అందు శిల్పకారుని భావనాప్రదర్శనమునకుఁ జోటులేదు. అనుకరణమునందు నూతనసృష్టి యుండదు గాన అది యుత్తమ శిల్పము గానేరదు.

శిల్పము అనుకరణమా? లేక సృష్టియా? అను విషయమును గుఱించి చాల అభిప్రాయ భేదములు గలవు. వానిని గొందఱు అనుకరణ మనియు, మఱికొందఱు సృష్టి, యనియుఁ బలుపలు విధములుగఁ దలంచుచున్నారు. శిల్పము అనుకరణమని తీర్మానించిన వారిలోఁ బ్రథముఁడు గ్రీసు దేశస్థుఁడైన అరిస్టాటల్ అను తత్త్వ శాస్త్రజ్ఞుఁడు. అప్పటి నుండియుఁ బాశ్చాత్యులెల్లరును శిల్పము ప్రకృతియొక్క