పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

కవికోకిల గ్రంథావళి

ప్రతిభావంతులగు కవుల రచనలను మనము విమర్శించి చూచితిమేని, అవి చిరంజీవములగుటకుఁ గారణములు మనకు గోచరింపకపోవు. వానియందు కాలమును ధిక్కరించు శాశ్వతగుణమేదియో యొకటి తప్పక యుండితీరును. ఉత్తమ కృతుల విమర్శ నమువలనఁ దేలిన సామాన్యాంశముల నిటఁ బొందుపఱచుచున్నాను:

(1) అంగాంగ సంయోగత.
(2) అనురూపత.
(3) వస్తువునందలి సర్వజనీన స్వభావము.
(4) కవి వ్యక్తిత్వము .

అంగాంగ సంయోగత ప్రతిరూపమునకును ఆవశ్యకమైన నియమము విచ్చిన్నావయవ సమూహము సమష్టి రూపజ్ఞానము బుట్టింపనేరదు. కావున 'సంయోగత' శిల్ప శాస్త్రమునందు బ్రధాన సూత్రము. ఈ సూత్రమునకు లోఁబడని కావ్యములు నిర్జీవములుగ నుండును. ఉత్తమ కావ్య నిర్మాణమునం దీనియమము బహుజాగరూకతతో ననుసరింపఁబడును.

ఉచితానుచిత జ్ఞానము లేనివాఁడు, కవి కానేరడు. అనౌచిత్యము రసభంగమునకుఁ బ్రధాన హేతువు. కాండ జ్ఞానము, కళాభిరుచియు లేనందునను, లోభమువలనను, కవి యనౌచిత్యదోషమునకుఁ బాల్పడుచున్నాఁడు. అది వఱకు వ్రాసికొనియుంచిన రసవంతములగు పద్యములందలి లోభముచేతఁ గొందఱు కవులు అనవసరముగను, అసందర్భముగను తమ కావ్యములయందో, నాటకములయందో