పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

29

వానిఁ జొప్పించి రసభంగమునకు సహాయపదుచున్నారు, అట్టివారియందు కళాభిరుచి లోభ తిరస్కృతమై యడఁగి యుండును. మఱియు కవి మొట్టమొదటఁ దన పతిభ కను రూపమైన వస్తువును, రసమును రూపమును గుర్తెఱిఁగి యేర్పఱచుకొనవలయును. ఇది చాల ముఖ్యము. కొందఱు కవులు కొలఁది యెఱుఁగక కొండను కౌఁగిలించుకొనఁబోయి భగ్నమనోరథు లగుటయు, మఱికొందఱు తమ ప్రకృతి కనుకూలింపని రసములఁబోషింపఁ బయత్నించి చెడగొట్టు కొనుటయు మనము చూచుచున్నాము. కాళిదాసు శృంగారమును బోషించుటలో నసదృశుఁడు. భవభూతి కరుణయం దద్వితీయుఁడు కాని, ఆయన ప్రతిభ నాటక రచన కనుకూలించునది గాదు. కావుననే యుత్తరరామ చరిత్రము దృశ్యప్రబంధమునకన్న శ్రవ్యప్రబంధముగ నెంచఁబడు చున్నది. సర్ వాల్టర్ స్కాటు మొట్టమొదట కవిత్వము వ్రాయుచుండెను. కాని, యంతకన్నఁ దన ప్రతిభ నవలలు రచియించుట కనుకూలించునని యెఱింగి, యపూర్వ కథా సాహిత్యమును నిర్మించెను. రవీంద్రనాథ టాగూరునందు గేయ ప్రతిభ మిక్కుటముగ నున్నది. ఆయన వేలకొలది చక్కని గీతములను రచియించెను. కాని, మయికేలు మధుసూదనదత్తువలె 'మేఘనాథవధ' వంటి పెద్ద కావ్యమును రచియింప లేదు, ఒక్కొక్క కవి అంతః ప్రకృతి యొక్కొక విధమయిన కావ్యకల్పనకుఁ దగియుండును. కావున వారివారి కనుకూలమైన త్రోవలు వెదకికొనుట. విజయమునకు మూల సాధనము. అందుకు భిన్నముగఁ బ్రవర్తించువారు ఏటికి నెదు