పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

౨౬౫


మునకును సాదృశ్యము కల్పించి 'అందుండినట్లే యిందేల యుండలేదు' అని ప్రశ్నించుట కూడ ఒకవిమర్శన చమత్కృతి కాఁబోలు!

అగ్బరు తాన్ సేనుల సంభాషణము మెట్టవేదాంతము కాదు--ఆసంభాషణమూలమున మనకు వారి మనస్తత్త్వము చక్కగస్ఫురించును. ఇట్టి భాగములు చదువునప్పుడు ఇంపుగనే యుండును. కాని ప్రదర్శన పరముగఁ జూచినపుఁడు, కార్య ప్రచలనము లేనందువలన, కొంత (విసువు) monotony గోచరించును. కవి యీ సీనును” కొంత సంస్కరించిన బాగుగ నుండుననియే నాయాశయమును.

V

“కొన్ని యసంభవములు” అనుశీర్షికక్రింద పదునేఁడు అసంభవములను మీరా నాటకమునందు రసలుబ్ధుఁడు చూపించెను. ఈ యసంభవములను గుఱించి కొంత తెలిసి కొనవలయును, నాటకమును గొందఱు "ప్రతిసరంబునఁ దన్మయ భావ మొంది ” చదువుదురు. అట్టి పఠితలు, ఆట చూచునప్పుడు ఎట్టి యానందముంబొందుదురో అట్టి యానందమునే చదువునప్పుడును పొందుదురు, కొందఱు దోషనిరూపణము కొఱకే చదువుదురు. ఇట్లు చదువువారికి అసంభపములని తోఁచినవి ఆటచూచు వారికిగాని, మొదటి విధమునఁ జదివిన వారికిఁగాని తోఁపవు. నాటకముఁ జదువునపుడు కొన్ని సంభవములుగఁ దోఁచినవి ప్రదర్శింపఁబడినపుడు అసంభవములుగ నగపడును. ఉదాహరణము: ఉత్తర రామచరితమున, దండ