పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/272

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

266

కవికోకిల గ్రంథావళి


కాటవియందు రాముండు సీతను స్మరించుకొని దుఃఖంచు ఘట్టమున, వనదేవతల ప్రభావముచే అదృశ్యమానయగు సీత రాముని ప్రక్క నిలఁబడియుండును. ఈ భాగముఁ జదువునపుడు అసంభవమేమియు గోచరింపదు. ఏలయన సీత అదృశ్యగానున్నదని యనుకొనుటకు మనభావము ఉపకరించును, కాని, యీఘట్టము ప్రదర్శింపఁబడినపుడు, సీత యగపడు చుండఁగా అగపడ లేదని భావించి మన కన్నులను వంచించు కొనఁజూచుట యసాధ్యము.

వ్యవహార సిద్ధమైన ప్రపంచమువేఱు; నాటక ప్రపంచము వేఱు; ఒక దానిని వేఱొక దాని దృష్టితో విమర్శించుటఉభయము నెఱుంగమికిఁ దార్కాణము. కొన్నిదినములు, నెలలు, సంవత్సరములలో జరిగిన విషయము మూఁడు నాలుగుగంటలలోఁ బ్రదర్శింపఁబడవలసిన రూపకముగ నిర్మిత మగుటచేతఁ గొన్నిసమయములను నియమములను కవులు అంగీకరించిరి. సామాజికులు నాటక ప్రదర్శనములోని కాల సంకోచమునకు అలవాటుపడిన వారగుట అందు అసంభవత్వము గోచరింపదు.

ఒకప్పుడు సంభవములుకొన్ని అసంభవములుగ నగపడును “Truth is stranger than fiction" అను సామెత మనము విననిది కాదు. నాటకము చూచువారికిని జదువు వారికిని అసంభవములని తోఁపఁదగువానినే కవి ఆలోచింప వలయును.

రసలుబ్ధుఁడు నాటకములోని విషయములను జ్ఞప్తి పెట్టుకొని యుండిన ఇన్ని సందేహములకుఁ బ్రశ్నలకు అవ