పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

264

కవికోకిల గ్రంథావళి


డెస్ డెమోనా వధ అట్లు చూపింపఁ బడవలయునా లేదా అనువిషయమును గుఱించి ఆంగ్లేయ విమర్శకులలోనే భిన్నాభిప్రాయములు గలవు.

"To some readers again, Parts of Othello appear shocking or horrible. They think...that in these parts Shakespeare has sinned against cannons of art, by represesting or the stage a violence or brutality the effect of which is unnecessarily painful and rather sensational than tragic."

ఇట్టి విషయములందు సామాజికుల మనస్తత్వముల ననుసరించి భిన్నాభిప్రాయములు పొడసూపుచుండును.

పురుషేర్ష్యాకారణమును” రచ్చ కెక్కించి మంత్రుల యెదుట విచారించుట మందమనియు, ఇందు రహస్యముండ వలయుననియు మఱియొక యాక్షేపము.కుంభరాణా మంతులను బిలిపించినది పురుషేర్ష్యాకారణమును విచారించుటకు గాదు. అమూల్యమైన వజ్రహారము తెన యంతఃపుర దాసి సుశీల ధరించుకొనియున్నదను సంగతివిని, బలవంతరావు వలన కొన్నిసంగతులు తెలియఁగా, ఆ విషయములను విచారించుటకు మంత్రులను రావించెను. ఆవిచారణయందు వైద్యుల వృత్తాంతమును ఆ వైద్యులలో నొకఁడు అగ్బరగుటయుఁ దెలియవచ్చెను. పురుషేర్ష్యాకారణము రహస్యముగ నుండుటకు వీలులేదు. రాణా ఈర్ష్యాగ్రస్తుఁడగు భర్తయేగాదు; న్యాయాధిపతికూడ. ఈ రెంటికింగల భేదమును గ్రహించుట వలననే రాణా గొప్పతనమును ధర్మబుద్ధియు గోచరించు చున్నవి. ఏదో యొక నాటకమును దీసికొని దానికిని ఈనాటక