పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కన

233

(7) ఉదయాస్తమయాది వర్ణనములు కథలో మేళవించునట్లు చేయుట.

(8) భావరసానుగుణమైన శైలి.

వీని యన్నిటి సమిష్టి ఫలితమేమనగా ఆంధ్రీకరణము సంస్కృత మాతృకకంటె వేయింతలు కళావిశిష్టమయి సినిమా చిత్రమువలె అనుక్షణ భిన్న కార్యశీలమయి ఆంధ్ర సారస్వతమునకు పట్టుగొమ్మయయి నిలిచినది.

కొన్ని ఉదాహరణములు :

(1) విరహవిహ్వలుడైన కీచకుని యవస్థావర్ణనములు, సంభాషణములు, ఆ ఘట్టములోని ద్రౌపదీవర్ణనములు చాల వఱకు అమూలకములు. అవి లేతపాకపు ప్రబంధధోరణిలో పడినను చాల మనోహరములై యున్నవి.

సుధేష్ణ వారుణి దెమ్మని ద్రౌపదిని కీచకుని యింటికి పొమ్మనినప్పటి స్థితి మూలమున "శంకమానారుదతీ ” అని చెప్పబడియున్నది. ఇది కొంచ మించు మించు " ద్రౌపది సందేహిస్తూ ఏడ్చును” అన్న Stage direction కు సరిపోవును. కాని యిక్కడ లోపించినది ఆ direction ననుసరించి అభినయించే పాత్ర. ఆ లోపాన్ని తిక్కన పూరించినాడు. అట్టి ద్రౌపది పాత్రను నాట్యరంగమున నిలబెట్టి మన కన్నుల యెదుట అభినయింపించినాడు,

“ఉల్లము తల్లడిల్ల దనువుద్గత ఘర్మజలంబు దాల్చుచున్ డిల్లవడంగ” ఇంతవఱకు ఈ చిడిముడి పాటంతా అభినయము, “నాకిది కడింది. విచారముపుట్టె; అందుఁబో నొల్ల ననంగరా, దచటి కూరక పోవనురాదు,