పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

కవికోకిల గ్రంథావళి


నేర్పు సంధిల్లగ దీని బాసికొను దీమసమెట్టిదొ” --- ఇది స్వగతము. మనసులోని ఉరిమాట, తలపోతల పోరాటము. To be or not to be that is the question అనే మానసిక సంఘర్షణము. ఒక చిన్న Stage direction ను అభినయించు పాత్రగా మార్చగలిగిన తిక్కన యింద్రజాలమె తెలుగు భారతమునకు అనన్యమైన విశిష్టతను చేకూర్చినది.

(4) తిక్కన నిశితమైన లోకజ్ఞానము కలవాడు కావున ఔచిత్యములను చక్కగ పోషించెను. బృహన్నలను ఉత్తరకు ఆట నేర్పుటకు నియోగించుటకు పూర్వము అతడు నిజముగ నపుంసకుడా లేక పుంసత్వముకలవాడా అను సంగతి ప్రమదలచేత పరీక్ష చేయించి విరటుడు తన సంశయము తీర్చుకొన్నట్లు మూలమున నున్నది. ఇది చాల మొరటుగాను బూతుగాను కనిపించును. దీనిని "నైపుణంబున నుచితంబుమై నరసి” యని తిక్కన నాజూకుగా మార్చి తన సున్నితమైన యభిరుచిని వెల్లడించెను.

(5) “నిగూఢ స్త్వం తథా పార్థకీచకంతం నిషూ దయ” అని కీచకుని రహస్యముగ చంపవలయునని భీమునితో ద్రౌపది చెప్పినట్లు మూలమున నున్నది. దీనికి విరుద్ధముగా భీమ కీచకుల యుద్ధము ఇట్లు వర్ణింపఁ బడినది,

“శబ్దసమభవద్ఘోరో వేణుస్ఫోట సమోయుధి ”అనిన్నీ అన్యోన్యం ప్రతిగర్జ తాం" “విరురావ మహాబలం” అనిన్నీ నదంతంచ మహానాదం భిన్నభేరీ సమన్వితం” అని - అంటే, పూరిండ్లు కాలునప్పుడు వెదురు బొంగుల గణు