పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

19


వ్యాపారములనుండి మరల్చి తనయందు లగ్నమ---------- రింపఁజాలదు. చిత్రకారునికి రంగులకు నెట్టి సంబంధము గలదో కవికిని కవితాసామాగ్రికిని అట్టిసంబంధ మె. అంగాంగ సంయోగత, ఔచిత్యము, వర్ణ నా సౌందర్యము, జీవకల్పనము మున్నగునవి కవియొక్క శిల్పనైపుణ్యమునకు జెందినవి. కావున కవి ప్రతిభా శక్తివలన కావ్యమునకు సాధుత్వమును, ప్రతిభా దౌర్బల్యమువలన అసాధుత్వమును సిద్దించును. ఇట్లనుటవలన కావ్యములు వ్యాకరణదోష భూయిష్ఠములుగ నుండవలయుననుట నామతముగాదు. కాని, భాషావిషయక దోషములకన్న శిల్ప కల్పనాదోషములె రస రామణీయకములకు భంగము వాటిల్లఁ జేయునని నామనవి.

[1] విశ్వనాథుఁ డొక దోషమును ఖండించి మఱియొక దోషమును దెచ్చి పెట్టెను. ఆయన 'వాక్యం సాత్మకం కావ్యం ' అని కావ్యలక్షణమును నిర్ణయించెను. ఇది (ఆచార్య దండిమతముతప్ప) పూర్వలాక్షణికుల మతములకన్న విశా

లముగ నున్నట్లు తోచినను, విమర్శించిచూడ నీ వచనము

  1. నేను “రసరామణీయకములు" అను వ్యానమునఁ దెలిపినటుల చేతనాచేతన భేదములేక ధమణీయ భావము లన్నిటియందు రసముండుసను మతము నంగీకరించు పక్షమున "వాక్యం రసాత్మకం కావ్యం" అను నిర్వచనముగూడ నంగీకృతమైనట్లె అట్లుగాక రసము కేవలము మానవ చర్యలకు సంబంధించినదే యని తలచుఁనెడల ఈ వ్యానమునందుఁ జూపఁబడిన యభ్యంతరమువలన విశ్వనాథుని నిర్వచనము సంకుచిత మగును. "(ఇష్టార్థవ్యవచ్చిన్నా పడావళి)"

    ఇచ్చట “ఇష్టార్థ” మవఁగా హృద్యార్థము, లేక రమ్యార్థము.