పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కవికోకిల గ్రంథావళి


శీర్షికగత్వావరణమును సంకుచితము చేయుచున్నది. ఏలయెన 'విభావానుభావ వ్యభిచారి సంయోగా ద్రసనిష్పత్తిః' అని భరతుని రసలక్షణము. దీనిఁబట్టిచూడ రసము కేవలము మానవచర్యలకు సంబంధించినదని తేలుచున్నది. తిర్యగ్జంతువుల చేష్టలయందు రసాభాసము (రసస్పర్శ) మాత్రము గలదని విశ్వనాథుని యభిప్రాయము. కావున రసమనునది మానవ చర్యలయందుఁ బూర్ణముగను, పశుపక్షి మృగాదుల చేష్టల యందు ఆభాసముగను ఉండునని తెలియ వచ్చుచున్నది. కాని, యచేతన వ్యాపారములందు ఏలాటి రసస్పర్శకుఁగూడఁ జోటులేదు. కావున ‘వాక్యం రసాత్మకం కావ్యం' అను లక్ష.ణమును మన మంగీకరించిన యెడల పాశ్చాత్యుల ప్రకృతి కవిత్వమును, (Lake Poetry, Nature Poetry! సూర్యా స్తమయములు, ఉద్యానవనములు, నదులు, కొండలు, మేఘములు, నక్షత్రములు, చంద్రుఁడు మున్నగువాని వర్ణ నములకు కావ్యత్వము సిద్ధింపదు.

'ఉపవన జల చంద్రికోత్సవార్తనలీల లాత్మవిహారంబు లనఁబరగు' అని యుండుటవలనఁ 'బై నఁ బేర్కొనఁ బడిన యుద్యానాది విషయములు ఉద్దీపన విభావములకు నాధార భూతములుగావున రసవ్యంజకములగును. అట్లగుట “వాక్యం రసాత్మకం కావ్యం' అను లక్షణములో నివిగూడ నిమిడి యున్నవి, అని కొందరు తలంపవచ్చును. కాని, యీలాటి వర్ణనములు నాయికా నాయకుల వ్యాపారములలోఁ గలసి పోయి వారి చర్యలకు సంబంధ పడినప్పుడె అవి యుద్దీపన విభావములకుఁ గారణములగును. కాని, కవియె యట్టిదృశ్య