పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

16

కవికోకిల గ్రంథావళి


శీర్షి కగ నుండఁదగినంత భావగంభీరముగ నున్నది. కవియొక్క. భారతి ప్రకృతి నియమ బద్దకముగాదు! హ్లాదైక మయమును నవరస రుచిరమునైన యొక స్వతంత్ర నిర్మా ణము ! మఱియు లోకోత్తర వర్ణనా నిపుణ కవికర్మ కావ్యమని మమ్మటుఁడు వివరించెను. ఈ యభిప్రాయమును లాక్షణికు లందఱు నేదో యొకవిధముగ నంగీకరించి యున్నారు. లోకోత్తరత్వమనఁగా అనుభవసాక్షికమయిన యాహ్లాదగత చమత్కారమని పండిత రాయలును, చమత్కార మనఁగా చిత్త విస్తార రూపమగు విస్మయమని విశ్వనాఁథుడును వివరించిరి. ఇట్లనుటవలన చమత్కార రహితములగు కేవల శబ్దార్థములకు కావ్యయోగ్యత సిద్దింప దనియు, అవి ప్రతిభాశాలియగు కవి రచనా నైపుణ్యము వలన నలౌకిక రూపగుణ సౌందర్యములను దాల్చి, కావ్య మనిపించుకొనుననియు మన మూహింపవలయును. లోక సామాన్యమైన రూపములను జూచినప్పుడు మన కేలాటి విస్మయము జనింపదు. దానియందు మన చిత్తము నాకర్షింపఁజాలినంత యసాధారణ విశేష మేదియు గోచరింపదు. కాని, మన మెన్నడునుజూచి యెఱుఁగని యొక సౌందర్యవతిని దారిలోఁ గనుగొన్నపుడు, ఆహా? యీమె యెంత రూపవతి ? అని యచ్చెరుఁవొందుచుఁ గొంతసేపు నిలబఁడి. నిర్వ్యాజముగ నామెతట్టు చూచుచుందుము. అసామాన్య రూపసందర్శనమువలన నిటువంటి వింత పొడముచుండుట సహజము. కవిత్వమునఁ గూడ నీలాటి లోకోత్తరత లేనియెడల కావ్యము చదువరుల హృదయమును లౌకిక