పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యంలో వైచిత్రి

217

"A little noiseless noise among the loaves
 Born of the very sigh that silence heaves"

“నిశ్శబ్దమైన కంఠధ్వని ఆకులలో వినబడుచున్న ది. నిశ్శబ్దత ఊర్చిన నిట్టూర్పువలె నున్నది” అని ఒక చోట 'కీట్సు' (Keats) అంటాడు . అప్పటి Neo-classic కవులు యీ విధముగా వ్రాసియుండరు. నిశ్శబ్దమైన శబ్దమేమి ? దానిని చెవి యెట్లు గుర్తించును ! దానిని శబ్దమనుటెట్లు ! ఈలాటి మీమాంసలోపడి తుదకు దానిని తప్పని త్రోసిపుచ్చెదరు. శబ్దములేని కంఠస్వరం అను ప్రయోగము హేతువాదమునకు నిలువ లేక పోయిననూ పంచేంద్రియాతిరిక్తమైన యేదోయొక రహస్యేంద్రియముద్వారా బుద్దివ్యాపార నిరపేక్షకముగ హృదయములో ప్రవేశించి అనూహ్యమైన నిశ్శబ్దతను కల్పించి మనలను రసతిన్మయులను చేయుచున్నది. "వినిన మధురగీతికలు ఆనందదాయకములే కాని వినని మధుర గీతికలు, మరీ ఆనందదాయక ములు” అని పాడిన కవికి నీరవవాణిని విను దివ్యశ్రోతస్సు ఉండవలెను. ఆనందవర్ధనుడు నిర్వచించినాడు.

“శబ్దార్ధ శాసనజ్ఞాన మాతేణైవ నవేద్యతే,
వేద్యతేనహి కావ్యార్థ తత్త్వజ్ఞె రైవ కేవలం

మహాకవుల వాక్యములలో పదాతిరిక్తములైన భావములు స్ఫురించుచుండును. వానిని తెలుసుకొనుటకు శబ్దార్థ శాసన జ్ఞానముమాత్రమే చాలదు. కావ్యార్థ త త్త్వజ్ఞత అవసరము.

వైచిత్ర్యమునకు మూలము నవ్యత్వమంటిరిగదా? మానవుని రసావేశము లలితకళల మూలమున బహిర్గత