పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

కవికోకిల గ్రంథావళి


మగుటకు మొదలుపెట్టి కొన్ని వేల సంవత్సరములైనవి. ఇంకను క్రొత్తదనమేమి ఉండును? అని సంశయమా? ప్రకృతి అనంతము. అనుక్షణ పరిణామశీలము. దేశకాలపరిస్థితుల మార్పులు, కవుల ప్రత్యేక ప్రతిభావిశేషములు ఈ నవీనత్వమునకు హేతువులు. ఒకే విషయము పదిమంది కవులు చెప్పినయెడల తలకొక విధముగనుండును. కవిత్వముపుట్టి నప్పటినుండి స్త్రీ వర్ణనము కవిత్వములోనికి దిగినది. ఎన్ని వేల సంవత్సరములనుండియో కవులు స్త్రీలను వర్ణించుచున్నారు. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ మొగమె కాని యిన్ని వేలమంది కవులకు పరిమితమైన స్త్రీ శరీరము కవితాలంబము కావడ మెట్లు? వస్తువు ఒక టే అయిసను భావప్రకటన వివిధత్వము. వలన చమత్కారమువలన సవ్యముగా కనపడును.

తేనెవాకలంకల్లో పెరిగిన చేమకూర రుచి చూస్తాం !

కడుహెచ్చు కొప్పు, దానిం
గడవం జనుదోయి హెచ్చు, కటియన్నిటికిన్
గడు హెచ్చు, హెచ్చులన్నియు;
నడుమే పసలేదుగాని నారీమణికిన్.

సాధారణమైన భావమే. సాధారణమైన వర్ణనయే. కాని, భావప్రకటనలో చమత్కారమున్నది. తిట్టినట్టె తిట్టి పొగడి నాడు కవి.

ఇక, 'యతి విటుడు గాకపోవుటెట్లని' ప్రతిజ్ఞ చేసిన సంకుసాల కవి:

“ఒత్తుకొనివచ్పు కటికుచోద్వృత్తి చూచి
 తరుణి తనుమధ్యమెచటికో దలగిపోయె.”