పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/222

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

216

కవికోకిల గ్రంథావళి


కళయే ఉండదు. కాని ఆ లక్షణములు స్వయంకల్పితములు. ప్రతిభోచితములు. ప్రత్యేకములు,

కాళిదాసు, .భవభూతి మున్నగు సంస్కృత కవుల యందును “భావాంబరవీధి విశ్రుత విహారిణి” అని సరస్వతిని ప్రశంసించిన నన్నయ మొదలు ఈ కాలమువరకు గల తెలుగు కవులయందును ఈ Romantic element "దేశకాల పాత్రభేదముల ననుసరించి కొద్దిగనో, గొప్పగనో గోచరించు చున్నది. నేటికాలపు కవులే Romantic కవులని చెప్పుటకు వీలులేదు. కాలభేదం, ఆచార వ్యవహారభేదం ఉండుటవలన అందుకు తగువైనవిధముగా ఈ Romantic element మారుతూ వచ్చినది.

18 వ శతాబ్ది ఇంగ్లీషు వాఙ్మయ చరిత్రలో నీరసమైన ఘట్టమని కొందరి ఆంగ్లేయ విమర్శకుల అభిప్రాయము. ఆ కాలపు neo-classic పద్ధతికి ప్రతిస్పర్ధిగా Romantic కవితోద్యమము 19వ శతాబ్ది ఆరంభమున బయలు దేరినది. ఆకాలపు నవ్యకవులకు లక్షణ నిర్బంధములు, ఛందో నిర్బంధములు, వ్యాకరణపు కట్టుబాట్లు అసహ్యములుగా తోచినవి. పూర్వ రచనపై అసంతృప్తి కలిగినది. ఈలాంటి స్వేచ్చా ప్రియత్వం కలుగుటకు ఫ్రెంచి విప్లవంవల్ల ఇంగ్లాండులో వ్యాపించిన నూతన భావముల ప్రభావమే కారణమని చెప్పవచ్చును. బందాలు వదలించుకొని కాలుసేతులు హాయిగా చాపుకొన్నారు కవులు. ఈ మార్పు రచనలలో గోచరించినది.