పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యంలో వైచిత్రి

“యా వ్యాపారపతీ రసాన్రసయితుం కాచిత్ కవీనాం నవాదృష్టి!” అను ఆనందవర్ధనుని నిర్వచనమును, “క్షణే క్షణే నూతనైర్వైచిత్రైః జగన్త్యా సూత్రయంతి" అని 'నవ' అను విశేషణమును అభినవ గుప్తపాదులు వివరించినారు. అనుక్షణము నూతనమైన వైచిత్రులతో జగత్తులను సూత్రిస్తూ ఉంటుందట కవి ప్రతిభ ..

ఈ " వైచిత్రి"నే Romantic element అనే మాటకు పర్యాయపదంగా నేటి విమర్శకులు రూఢి చేస్తున్నారు. ఈ వైచిత్ర్యము నే లోకోత్తర చమత్కారమ"ని పూర్వ లాక్షణికులు చెప్పియున్నారు,

ఈ Romantic element_ వైచిత్రి అనునది కవిత్వమునకు సహజమైన జీవమువంటిదా, లేక అనుషంగికముగా వచ్చిన కావ్యశోభా హేతువులలో నొకటియా?

యదార్ధమైన కవిత్వమునకు వైచిత్ర్యము జీవము, నవ్యతయే యీవైచిత్ర్యమునకు మూలము, Romantic poetry అంటే భావనాపటిష్ఠమైన స్వేచ్ఛా ప్రియ కవిత్వమని మనము నిర్ణయించుకొను పక్షములో మహాకవుల కావ్యములన్నియు ఈ వర్గమునకే చెందును.

మహాకవి కవిత్వము స్వేచ్ఛాప్రియమని యంటివిగదా అట్లయిన అది లక్ష్మణబద్ధముగాదా ? లక్షణబద్ధముకాని